బిజినెస్

తగ్గిన టివిఎస్, ఎన్‌ఫీల్డ్ వాహన ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: దేశంలో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుకు సమయం సమీపిస్తుండటంతో దీని ద్వారా ఒనగూడే ప్రయోజనాలను వినియోగదారులకు అందజేసేందుకు ఆటోమొబైల్ సంస్థలు వరుసగా తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయి. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థల్లో ఒకటైన బజాజ్ ఇప్పటికే తమ సిటి-100 బైకు మొదలు కొని డొమినార్-400 బైకు వరకు వివిధ మోటార్ సైకిళ్ల ధరలను 4,500 వరకు తగ్గించగా, మరో సంస్థ యుఎం లోహియా తమ రెండు మోడళ్ల ధరలను రూ.5,700 వరకూ తగ్గించిన విషయం విదితమే. ఇప్పుడు మరో రెండు ద్విచక్ర వాహన సంస్థలు టివిఎస్ మోటార్ కంపెనీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తమ వాహనాల ధరలను తగ్గించి ఈ జాబితాలో చేరాయి. దేశంలో ఎప్పటి నుంచో బైకులను ఉత్పత్తి చేస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ తన వాహనాల ధరలను (ఆన్-రోడ్, చెన్నై) శ్లాబుల వారీగా రూ.1,600 నుంచి రూ.2,300 మేరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ శ్లాబులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయని ఆ సంస్థ పేర్కొంది. కాగా, టివిఎస్ మోటార్ కంపెనీ మాత్రం తన వాహన ధరలను ఏమేరకు తగ్గిస్తున్నదీ ప్రకటించలేదు. అయితే జిఎస్‌టి అమలుతో వ్యాపారం మరింత సులభతరమవుతుందని, దీని ద్వారా ఒనగూడే ప్రయోజనాలను తమ వినియోగదారులకు తప్పకుండా అందజేస్తామని ఆ సంస్థ ప్రెసిడెంట్, సిఇఓ కెఎన్.రాధాకృష్ణన్ స్పష్టం చేశారు.