బిజినెస్

లాకర్లలోని సొమ్ములకు పూచీ మాది కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: బ్యాంకుల్లోని సేఫ్ డిపాజిట్ లాకర్లలో ఉంచే సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుందని, ఒక వేళ లాకర్లలో ఉంచిన సొమ్ము చోరీ అయినా నష్టపరిహారం లభిస్తుందని చాలామంది ధీమాగా ఉంటుంటారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని సేఫ్ డిపాజిట్ లాకర్లలో ఉంచిన సొమ్ముకు బ్యాంకుల బాధ్యత ఏమాత్రం ఉండదని లాకర్‌ను అద్దెకు తీసుకునే సమయంలో చేసుకునే అగ్రిమెంట్‌లోనే స్పష్టంగా ఉందట. సమాచార హక్కు చట్టం కింద ఓ న్యాయవాది అడిగిన ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్, 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చిన తమ సమాధానంలో ఈ విషయం స్పష్టం చేశాయి. బ్యాంకులు ఇచ్చిన సమాధానంతో నివ్వెర బోయిన ఆ లాయరు ఇప్పుడు లాకర్ సర్వీసుకు సంబంధించి బ్యాకులు ఒక కూటమిగా తయారయ్యాయని, యాంటీ కాంపిటేటివ్ పద్ధతులకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ) తలుపు తట్టారు. దీనికి సంబంధించి తాము ఎలాంటి నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వలేదని, అంతేకాకుండా కస్టమర్‌కు కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఎలాంటి కొలమానాలను నిర్దేశించలేదని ఆర్‌బిఐ తన ఆర్‌టిఐ సమాధానంలో తెలియజేసిందని ఆయన సిసిఐకి తెలియజేశారు. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం తమకు ఎలాంటి బాధ్యతా లేదని చేతులు కడిగేసుకున్నాయని ఆయన తెలిపారు. లాకర్లకు సంబంధించినంతవరకు కస్టమర్లతో తమకు ఉన్న సంబంధం లెస్సీ (్భమి యజమాని), లెస్సర్ (అద్దెకుండే వ్యక్తి)కి మధ్య ఉండే సంబంధం మాత్రమేనని 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ సమాధానంలో పేర్కొన్నాయి. అలాంటి సంబంధంలో బ్యాంకుకు చెందిన లాకరులో ఉంచిన విలువైన వస్తువులకు బాధ్యత అద్దెకు తీసుకున్న వారిదే అవుతుందని కూడా ఆ బ్యాంకులు స్పష్టం చేశాయి. కొన్ని బ్యాంకులయితే తమ లాకర్ అద్దె అగ్రిమెంట్‌లో లాకరులో ఉంచే ఏ వస్తువయినా కస్టమర్ సొంత రిస్క్‌పైనే ఉంచడం జరగుతుందని, అందువల్ల వారు విలువైన వస్తువులను బీమా చేయించుకోవాలని స్పష్టంగా పేర్కొంటున్నాయి కూడా. బ్యాంకులు ఇచ్చిన సమాధానంతో ఆగ్రహించిన కుశ్ కల్రా అనే ఆ లాయరు బ్యాంకులు లాకర్లలో ఉండే వస్తువులకు ఎలాంటి బాధ్యత వహించనప్పుడు లాకర్లకు అద్దె చెల్లించి వాటిలో ఉంచడానికి బదులు బీమా చేయించి ఇంటిలోనే ఎందుకు పెట్టుకోకూడదో తెలపాలంటూ సిసిఐ ముందు ప్రశ్నలు లేవనెత్తారు. లాకర్ సేవలకు సంబంధించి బ్యాంకులు కూటమిగా ఏర్పడడంపై కాంపిటీషన్ చట్టం కింద దర్యాప్తు జరపాలని కూడా ఆ లాయరు కోరారు.