బిజినెస్

మా జిఎస్‌టిని అధ్యయనం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 26: భారతీయ వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలును అధ్యయనం చేయాలని అమెరికా బిజినెస్ స్కూళ్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న మోదీ.. ఆదివారం వాషింగ్టన్‌లో మాట్లాడుతూ ఏళ్ల తరబడి కృషి ఫలితం జిఎస్‌టి అని అభివర్ణించారు. వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమల్లోకి వస్తున్నది తెలిసిందే. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో వస్తున్న ఈ పరోక్ష పన్నుల విధానంలో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు. విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ తదితర 16 వేర్వేరు పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు. దీనివల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుండగా, జిఎస్‌టి అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నష్టపరిహారం కూడా కొంతకాలం తామే ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే అమెరికా బిజినెస్ స్కూళ్లలోని పాఠాల్లో ఒకటిగా జిఎస్‌టి ఉండదగినదని మోదీ అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులను ముఖ్యంగా అమెరికా నుంచి పెట్టుబడులను భారత్ పెద్ద ఎత్తున ఆశిస్తున్న క్రమంలో అమెరికన్లకు భారతీయ జిఎస్‌టిపై అవగాహన కలిసొస్తుందని మోదీ భావిస్తున్నారు. ఈ పర్యటనలో 20 ప్రముఖ అమెరికా సంస్థల సిఇఒలతో సమావేశం అయ్యారు మోదీ. అనంతరం తొలిసారిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోనూ భేటీ అయ్యారు. మరోవైపు జిఎస్‌టితో వినియోగదారులకు లాభదాయకమని, వ్యాపార, వాణిజ్య రంగాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సోమవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి అతిపెద్ద సంస్కరణగా జిఎస్‌టిని అభివర్ణించిన ఆయన వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసి తీరుతామని తేల్చిచెప్పారు. జమ్ముకశ్మీర్ మినహా దేశంలోని అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు జూలై 1 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తెస్తున్న క్రమంలో జమ్ముకశ్మీర్‌లో కూడా అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని సోమవారం కోరారు. ఇక జిఎస్‌టి అమలు సవ్యంగా సాగేందుకు ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టిడిఎస్), ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టిసిఎస్) ప్రొవిజన్లను వాయిదా వేసింది ప్రభుత్వం. అలాగే ఈ-కామర్స్ వేదికపై చిన్నచిన్న వ్యాపార అమ్మకాల నమోదు నుంచి కూడా మినహాయింపును ఇచ్చింది.
దీన్ని అమెజాన్ స్వాగతించింది. వాల్‌మార్ట్ ఇండియా అధ్యక్షుడు క్రిష్ అయ్యర్ సైతం జిఎస్‌టితో తమకు గొప్ప లాభాలు న్నాయన్నారు. కాగా, అఖిల భారత వాణిజ్య సమాఖ్య (సిఎఐటి) ట్రేడర్లకు అవగాహన కల్పించేందుకు జిఎస్‌టిపై శే్వతపత్రం విడుదల చేసింది. అయితే జిఎస్‌టి సమస్యల పరిష్కారానికిగాను ఓ అంబుడ్స్‌మెన్ లేదా లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని ట్రేడర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జిఎస్‌టిని వ్యతిరేకిస్తూ ఢిల్లీ ఫర్నీచర్ తయారీదారులు మూడు రోజుల బంద్‌ను సోమవారం ప్రారంభించారు.