బిజినెస్

డిప్యూటీ గవర్నర్‌గా రమ్మన్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: రఘురామ్ రాజన్‌కు తన హయాంలోనే డిప్యూటీ గవర్నర్ పదవి ఇస్తాం.. రండని ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ వైవి రెడ్డి తెలిపారు. ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ముందు 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్లపాటు ఆర్‌బిఐ గవర్నర్‌గా రాజన్ పదవీ బాధ్యతలు నిర్వహించినది తెలిసిందే. అయితే అక్టోబర్ 2004లోనే ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా రాజన్‌కు ఆఫర్ ఇచ్చానని అప్పటి గవర్నరైన వైవి రెడ్డి తన ఆటోబయోగ్రఫీ ‘అడ్వైజ్ అండ్ డిస్సెంట్: మై లైఫ్ ఇన్ పబ్లిక్ సర్వీస్’లో పేర్కొన్నారు. అయితే ఇందుకు రాజన్ అంగీకరించలేదన్న వైవి రెడ్డి.. నాడు ఆర్‌బిఐలో డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న రాకేశ్ మోహన్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా వెళ్లడంతో ఖాళీ ఏర్పడిందని, దీన్ని రాజన్‌తో భర్తీ చేయాలని భావించినట్లు చెప్పుకొచ్చరు. ఆ సమయంలో రాజన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్)లో ముఖ్య ఆర్థికవేత్త, పరిశోధనా విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ముంబయిలో తనను కలిసిన రాజన్‌కు ఈ ఆఫర్ ఇచ్చానని, మొదట్లో ఆలోచిస్తానని చెప్పినా.. తర్వాత అమెరికాకు తిరి గి వెళ్లిపోయాడని, ఆ తర్వాత పశ్చాత్తాపం చెం దారని వైవి రెడ్డి తన పుస్తకంలో రాశారు. అయితే దాదాపు పదేళ్ల అనంతరం రాజన్.. ఆర్‌బిఐ 23వ గవర్నర్‌గా వచ్చారన్న విషయాన్ని గుర్తుచేశారు. దువ్వూరి సుబ్బారావు నుంచి భారతీయ సెంట్రల్ బ్యాంక్ పగ్గాలు చేపట్టిన రాజన్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది తెలిసిందే.
నిజానికి తనకంటే ముందు ఆర్‌బిఐ గవర్నర్లుగా పనిచేసిన దాదాపు అందరూ ఐదేళ్లపాటు పదవిలో ఉన్నవారే. వైవి రెడ్డి కూడా 2003 నుంచి 2008 వరకు, దువ్వూరి సుబ్బారావు సైతం 2008 నుంచి 2013 వరకు ఆర్‌బిఐకి గవర్నర్లుగా పనిచేశారు. కానీ రాజన్ మాత్రం మూడేళ్లకే నిష్క్రమించారు. ఇందుకు కారణం.. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే ఆయన మనస్తత్వమే. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేసే ఆయన నిజాయితీనే. ముక్కుసూటిగా వ్యవహరించే రాజన్.. దేనిపైనైనా తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం మోదీ సర్కారుకు మింగుడు పడలేదు. ఈ క్రమంలోనే రాజన్ నాయకత్వంలో డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన ఉర్జిత్ పటేల్‌ను నిరుడు ఆర్‌బిఐ సారథిగా నియమించారు.

చిత్రాలు.. వైవి రెడ్డి* రఘురామ్ రాజన్