బిజినెస్

నేడు జనరల్ మోటార్స్ డీలర్ల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: అమెరికా ఆటో రంగ దిగ్గజం జనరల్ మోటార్స్.. భారతీయ డీలర్లు మంగళవారం జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతున్నారు. ఈ ఏడాది చివరికల్లా భారత్‌లో వాహనాల అమ్మకాలను నిలిపివేయాలని జనరల్ మోటార్స్ నిర్ణయించింది. ఈ క్రమంలో డీలర్ల పెట్టుబడులకు నష్టపరిహారంగా దాదాపు 12 శాతం మాత్రమే ఇస్తామని జనరల్ మోటార్స్ ప్రకటించడంతో దాన్ని నిరసిస్తూ డీలర్లు ఆందోళన బాట పడుతున్నారు. జనరల్ మోటార్స్‌కు దేశవ్యాప్తంగా 96 మంది డీలర్లుండగా, సుమారు 140 షోరూమ్‌లున్నాయి. ఇదిలావుంటే అమ్మకాల ఆపివేత క్రమంలో భారత్ నుంచి చెవర్‌లెట్ బీట్ సెడాన్ కార్లను లాటిన్ అమెరికాకు జనరల్ మోటార్స్ ఎగుమతి చేస్తోంది.