బిజినెస్

లుపిన్ వ్యవస్థాపక చైర్మన్ దేశ్ బంధు గుప్తా కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: ఔషధ రంగ దిగ్గజం లుపిన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ దేశ్ బంధు గుప్తా కన్నుమూశారు. సోమవారం ఉదయం ముంబయిలో ఆయన మరణించారు. అయతే గుప్తా మరణానికి కారణాలు తెలియరాలేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఆకస్మికంగా మృతి చెందారని సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు. గుప్తాకు భార్య, నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ‘ఈ ఉదయం మా నాన్న మృతితో మేమంత దుఖఃసాగరంలో మునిగిపోయాం.’ అంటూ గుప్తా కూతురు, లుపిన్ సిఇఒగా పనిచేస్తున్న వినిత గుప్తా, ఆయన కుమారుడు, సంస్థ ఎండిగా ఉన్న నీలేష్ గుప్తా ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. కాగా, 79 ఏళ్ల గుప్తా.. 1968లో లుపిన్‌ను స్థాపించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న లుపిన్.. ప్రస్తుతం 100కుపైగా దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది. మార్కెట్ విలువలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద జనరిక్స్ ఫార్మాస్యూటికల్ సంస్థగా లుపిన్ వెలుగొందుతోంది. రసాయన శాస్త్రంలో దేశ్ బంధు గుప్తా ఎమ్‌ఎస్‌సి పూర్తిచేశారు. ఫార్మా రంగంలో ఆయనకున్న అనుభవం లుపిన్‌ను.. భారతీయ ఔషధ రంగంలో ఓ దిక్సూచిగా నిలబెట్టాయ.

చిత్రం.. దేశ్ బంధు గుప్తా