బిజినెస్

15 వేల ఉద్యోగాలు పోతాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: అమెరికా ఆటో రంగ దిగ్గజం జనరల్ మోటార్స్‌కు చెందిన దేశీయ డీలర్లు మంగళవారం జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. భారతీయ మార్కెట్ నుంచి జనరల్ మోటార్స్ వైదొలుగుతున్న క్రమంలో దాదాపు 15,000 ఉద్యోగాలు గల్లంతవుతాయని డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జనరల్ మోటార్స్‌కు 96 మంది డీలర్లుండగా, 140 షోరూంలు నడుస్తున్నాయి. ఇందులో ఉత్తరప్రదేశ్‌లోని నొయిడా, ఘజియాబాద్‌కు చెందిన 40 మంది డీలర్లతోపాటు, వారి షోరూంలలో పనిచేసే సిబ్బంది మంగళవారం ధర్నాలో పాల్గొన్నారు. తమ పెట్టుబడుల్లో కేవలం 10 శాతం నష్టపరిహారంగా జనరల్ మోటార్స్ ఇస్తోందని, ఇది అన్యాయమన్నారు. మరింత నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారం సుహృద్భావ ధోరణిలో పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (ఎఫ్‌ఎడిఎ) ప్రధాన కార్యదర్శి గుల్షన్ అహూజా అభిప్రాయపడ్డారు. అలా జరగనిపక్షంలో లీగల్ చర్యలు చేపట్టి న్యాయపోరాటానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఇదిలావుంటే ఇప్పటికే భారత్‌లోని ఉత్పాదక కేంద్రాల్లోగల వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసే పనిలో జనరల్ మోటార్స్ నిమగ్నమైంది.