బిజినెస్

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులపై చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: ఇరు దేశాల మధ్య రోడ్డు, సముద్ర, విమానయాన రవాణా పెరిగేలా సహకారమివ్వాలని మయన్మార్‌ను భారత్ కోరింది. భారత్-మయన్మార్ ద్వైపాక్షిక వాణిజ్యం పెంపులో భాగంగా రెండు దేశాల వాణిజ్య మంత్రులు మంగళవారం ఇక్కడ కలుసుకున్నారు. మయన్మార్ వాణిజ్య మంత్రి థన్ మింట్.. భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇరువురు ఈ సందర్భంగా వాణిజ్య, పెట్టుబడులపై చర్చించారు. విశాఖపట్నం, చెన్నై నౌకాశ్రయాల నుంచి మయన్మార్‌కు రవాణాతోపాటు చెన్నై, గౌహతి నౌకాశ్రయాల నుంచి నేరుగా రవాణా సౌకర్యం వంటి వాటిపై మాట్లాడారు. కాగా, మయన్మార్‌తో భారత వాణిజ్యం విలువ 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2.05 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2.18 బిలియన్ డాలర్లుగా ఉంది.

చిత్రం.. ఫైళ్లను మార్చుకుంటున్న మంత్రులు