బిజినెస్

కాలం చెల్లిన విత్తనాలకు కొత్త ప్యాకింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 27: కాలం చెల్లిన విత్తనాలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారనే సమాచారం మేడ్చల్ మండలంలో తీవ్ర దుమారం రేపింది. పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధి మేడ్చల్ మండలంలోని కండ్లకోయ, గుండ్లపోచంపల్లి గ్రామాల మధ్య ఉన్న ఓ గిడ్డంగిలో కాలం చెల్లిన విత్తనాలను కొత్త ప్యాకింగ్‌లోకి మారుస్తున్నారని సమాచారం అందడంతో బాలానగర్ ఎస్‌ఓటి ఇన్‌స్పెక్టర్ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం దాడులు నిర్వహించారు. దీంతో పత్తితోపాటు వివిధ రకాల కూరగాయల విత్తనాలను కొత్త ప్యాకెట్లలోనికి మార్చి కాలపరిమితిని కూడా అక్కడే ముద్రిస్తున్నారనే విషయం వెల్లడైంది. ఓ కంపెనీకి చెందిన పత్తి, బెండకాయ, టమాట తదితర విత్తనాలను తీసుకువచ్చి రీ ప్యాకింగ్ చేస్తున్నారు. గత సంవత్సరం, ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మే నెలల్లో కాలపరిమితి ముగిసిపోయిన వాటిని కొత్తగా ప్యాక్ చేసి, తిరిగి 8, 9 నెలల కాల పరిమితిని ముద్రిస్తున్నారు. కాగా, పోలీసులు రంగప్రవేశం చేసి కొత్తగా చేస్తున్న ప్యాకింగ్‌ను నిలిపివేయించారు. సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్ డివిజన్ ఎసిపి శ్రీనివాస్‌రావు, ఇన్‌స్పెక్టర్ రంగారెడ్డి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విత్తనాలకు సంబంధించిన నియమ నిబంధనలను తెలుసుకునేందుకు మేడ్చల్ మండల వ్యవసాయాధికారి శైలజకు సమాచారం అందించారు. గిడ్డంగి వద్దకు చేరుకున్న ఆమె అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
రీ వాలీడేట్ చేసుకోవచ్చు: ఎఓ శైలజ
మరోవైపు మార్కెట్‌లోకి పంపిన విత్తనాలు పూర్తిగా అమ్ముడుపోకుండా తిరిగి ఉత్పత్తిదారుడి వద్దకు వస్తే కొత్తగా ప్యాకింగ్ చేసుకుని, రీ వాలీడెట్ చేసుకోవచ్చని వ్యవసాయాధికారి (ఎఓ) శైలజ స్పష్టం చేశారు. అందుకు సీడ్ నిబంధనలు అనుమతిస్తాయని పేర్కొన్నారు. అయతే విత్తనం జెర్మినేషన్ (మొలకెత్తే సామర్థ్యం) పరీక్ష నిర్వహించి నిబంధనల ప్రకారం ఉంటనే రీ వాలీడేషన్‌కు అవకాశం ఉంటుందని తెలిపారు. సూపర్ ఆగ్రోసీడ్స్ లైసెన్స్‌డ్ కంపెనీ, దీనికి అన్ని అనుమతులు ఉన్నాయని వివరించారు. ఇక్కడ ఉన్నవి నకిలీ విత్తనాలు కావని రీ వాలీడేట్ మాత్రమే చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. మేడ్చల్ ప్రాంతం నుండి కేవలం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకే కాకుండా పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు కూడా విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతున్న విత్తనాలను అన్ని విధాలుగా పరీక్షించి, ధ్రువీకరించలేని పరిస్థితి అని పేర్కొన్నారు. విత్తనాల కంపెనీ ఎవరికివారు జెర్మినేషన్‌కు బాధ్యత వహిస్తూ మార్కెట్‌లోకి విడుదల చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కలిపించిదన్నారు. ఈ క్రమంలో విత్తనాల్లో లోపం తలెత్తితే దానికి సదరు కంపెనీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వివరించారు. కాగా, ఇక్కడ మాత్రం రీ ప్యాకింగ్ చేస్తున్న విత్తనాలపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్యాకింగ్‌ను నిలిపివేస్తామని చెప్పారు. 50 క్వింటాళ్ల పత్తి, వివిధ రకాల విత్తనాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కొన్నింటి శాంపిల్స్‌ను శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ల్యాబ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. పరీక్షల్లో జెర్మినేషన్ నిబంధనల ప్రకారం లేకుంటే చర్యలు తీసుకుంటామని శైలజ అన్నారు.

చిత్రం.. విత్తనాల ప్యాకెట్లను పరిశీలిస్తున్న ఎఓ శైలజ, ఎసిపి శ్రీనివాస్‌రావు