బిజినెస్

మొదట్లో కొన్ని ఇబ్బందులుండొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తున్న క్రమంలో మొదట్లో కొన్ని ఇబ్బందులు ప్రజలకు ఎదురు కావచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అయితే తర్వాత జిఎస్‌టి ప్రయోజనకరంగా ఉంటుందని, దీర్ఘకాలంలో లబ్ధి చేకూరగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పన్నుల ఎగవేత, ధరల అదుపు వంటివి జిఎస్‌టితోనే సాధ్యపడగలవన్నారు. మంగళవారం ఇక్కడ ఎబిపి న్యూస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైట్లీ మాట్లాడుతూ వచ్చే ఏడాదిలోగా జిఎస్‌టి పరిధిలోకి రియల్ ఎస్టేట్‌ను కూడా తీసుకువచ్చేలా జిఎస్‌టి కౌన్సిల్ ప్రయత్నిస్తోందన్నారు. 1-2 సంవత్సరాల్లో జిఎస్‌టి క్రింద పెట్రోలియం ఉత్పత్తుల పన్నుల విధానాన్ని కూడా పునఃపరిశీలిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ముడి చమురు, సహజ వాయువు, విమానయాన ఇంధనం, డీజిల్, పెట్రోల్ జిఎస్‌టి పరిధిలో లేవు. అయితే నాఫ్తా, ఎల్‌పిజి, కిరోసిన్ మాత్రం జిఎస్‌టి పరిధిలో ఉన్నాయి. కాగా, జిఎస్‌టి అమలుపై రాజకీయాలు వద్దని జైట్లీ.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు సూచించారు. ఈ నూతన పరోక్ష పన్నుల విధానానికి సంబంధించి అన్ని నిర్ణయాలు జిఎస్‌టి కౌన్సిలే ఏకగ్రీవంగా తీసుకుందని స్పష్టం చేశారు. కాబట్టి ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని చెప్పారు. ఇకపోతే ఔషధ ధరల నియంత్రిత వ్యవస్థ ఎన్‌పిపిఎ.. మంగళవారం 761 ఔషధాల ధరలకు సంబంధించి ప్రొవిజనల్ సీలింగ్‌ను ప్రకటించింది. ఇందులో క్యాన్సర్, హెచ్‌ఐవి, డయాబెటిస్ నివారణ, యాంటీబయాటిక్ ఔషధాలున్నాయని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) చైర్మన్ భూపేంద్ర సింగ్ పిటిఐకి తెలిపారు. జిఎస్‌టి రానున్న క్రమంలో ఈ ఔషధాల ధరలను తగ్గించామని పేర్కొన్నారు. మరోవైపు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ పూర్తయిందని, జిఎస్‌టి అమలు సులభంగా జరిగేందుకు సిద్ధమని జిఎస్‌టి నెట్‌వర్క్ తెలిపింది. జిఎస్‌టిఎన్ పోర్టల్‌పై 66 లక్షలకుపైగా పన్ను చెల్లింపుదారులు నమోదు చేసుకున్నారని జిఎస్‌టిఎన్ పోర్టల్ చైర్మన్ నవీన్ కుమార్ తెలిపారు. వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమల్లోకి వ ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో వస్తున్న ఈ పరోక్ష పన్నుల విధానంలో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు. విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ తదితర 16 వేర్వేరు పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు. దీనివల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుండగా, జిఎస్‌టి అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నష్టపరిహారం కూడా కొంతకాలం తామే ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.