బిజినెస్

31వేల దిగువకు సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. గడచిన నెల రోజుల్లో ఎన్నడూ లేనంతగా మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 179.96 పాయింట్లు పడిపోయి 31 వేల స్థాయికి దిగువన 30,958.25 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 63.55 పాయింట్లు కోల్పోయి 9,511.40 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 9,500 స్థాయిని చేజార్చుకుని 9,473.45 వద్దకు చేరింది. అయితే మదుపరుల కొనుగోళ్లతో మళ్లీ కోలుకోగలిగింది. ఆర్థిక, ప్రభుత్వరంగ సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు కుదేలయ్యాయి. సిండికేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ షేర్లు 4.97 శాతం మేర క్షీణించాయి.
మార్చిలోగా 10 వేలకు నిఫ్టీ
ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) ఆఖర్లో (వచ్చే ఏడాది మార్చి 31)గా నిఫ్టీ 10 వేల స్థాయిని అధిగమించగలదని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ అంచనా వేసింది. 10,300-10,400 స్థాయి వద్ద స్థిరపడగలదన్న విశ్వాసాన్ని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ఎండి, సిఇఒ ధీరజ్ రెల్లి పిటిఐతో వ్యక్తం చేశారు. అలాగే మదుపరులు అత్యధికంగా జిఎస్‌టిపై దృష్టి సారించారని, ఈ పరోక్ష పన్నుల విధానం ఆధారంగానే తమ పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.