బిజినెస్

కెజి బేసిన్ తవ్వకాలకు ఒఎన్‌జిసికి అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: కృష్ణా-గోదావరి (కెజి) బేసిన్‌లో షేల్ గ్యాస్, చమురు అనే్వషణ కోసం ఐదు బావులను తవ్వేందుకు ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసికి పర్యావరణ అనుమతులు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌లోగల ఈ బేసిన్‌లో జరుగుతున్న ఈ తవ్వకాల అంచనా వ్యయం 217 కోట్ల రూపాయలుగా ఉంది. గత 35 ఏళ్లకుపైగా ఇక్కడ ఒఎన్‌జిసి గ్యాస్, చమురు ఉత్పత్తి చేస్తోంది. ఇదిలావుంటే వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)లోకి సహజ వాయువును చేర్చే అవకాశాలు కనిపిస్తుండగా, ఇది ఒఎన్‌జిసికి ప్రయోజనకరంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.