బిజినెస్

హెచ్‌సిఎల్-పారాబ్లూ మధ్య భాగస్వామ్య ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: క్లౌడ్ డేటా భద్రత, నిర్వహణకు సంబంధించి పరిష్కారాలను అందించేందుకు గాను దేశీయ ప్రీమియర్ ఐటి సర్వీసెస్ కంపెనీ హెచ్‌సిఎల్ ఇన్ఫో సిస్టమ్స్, పారాబ్లూతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా హెచ్‌సిఎల్ ఇన్ఫోసిస్టమ్స్, పారాబ్లూ ఉత్పత్తులు, సొల్యూషన్స్ అందించడంతో పాటుగా క్లౌడ్‌ను బ్యాకప్ తీసుకుంటూ ఆన్ ప్రిమైజ్ డేటాను భద్రపరిచే అత్యంత శక్తివంతమైన డేటా బ్యాకప్ సొల్యూషన్ ‘బ్లూ వాల్ట్’ను సైతం అందించనుంది. ఈ సందర్భంగా హెచ్‌సిఎల్ ఇన్ఫోసిస్టమ్స్ లిమిటెడ్ ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జాయింట్ ప్రెసిడెంట్ బిమల్ దాస్ మాట్లాడుతూ భారత దేశంలోని వ్యాపార సంస్థల డేటా బ్యాకప్‌ను భద్రపరిచేందుకు, రక్షణ కల్పించేందుకు విప్లవాత్మక టెక్నాలజీ ఆధారిత క్లౌడ్ సెక్యూరిటీ పరిష్కారాల కోసం పారాబ్లూతో భాగసామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పారాబ్లూ సిఈఓ ఆనంద్ ప్రహ్లాద్ మాట్లాడుతూ ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో క్లౌడ్ వైపు వ్యాపార సంస్థలను సురక్షితంగా తోడ్కొనిపోవాలనే మా లక్ష్యం మరింత వేగవంతంగా చేరుకోగలమని తెలిపారు. వ్యాపార రంగంలో తమ దృష్టిని కేంద్రీకరించడంతో పాటు క్లౌడ్, ఐఓటి, ఎనలిటిక్స్ వంటి డిజిటల్ టెక్నాలజీలలో సామర్ధ్యం మెరుగుపర్చుకోవాలనే హెచ్‌సిఎల్ లక్ష్యానికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు.