బిజినెస్

పుణెలో రూ.800 కోట్లతో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: గృహోపకరణాల తయారీలో పేరెన్నికగన్న చైనా సంస్థ ‘మిడెయా’ భారత్‌లో తమ వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. భారత్‌లో కార్యకలాపాల కోసం 2013 నుంచే పెట్టుబడులు పెడుతున్న ఈ సంస్థ తాజాగా 800 కోట్ల రూపాయల పెట్టుబడులతో పుణెలో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు గురువారం వెల్లడించింది. 43 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబోతున్న ఈ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ వచ్చే ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుందని, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, వాటర్ అప్లయెన్స్ ఉత్పత్తులను తయారు చేయడం జరుగుతుందని, ఈ యూనిట్ ద్వారా దాదాపు 500 మందికి ఉపాధి లభిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార వృద్ధి కోసం తాము ప్రధాననంగా భారత మార్కెట్‌పైనే దృష్టి కేంద్రీకరించామని, అందుకే ఇక్కడ కీలకమైన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని మిడెయా గ్రూప్ వైస్-ప్రెసిడెంట్ ఆండీ గు స్పష్టం చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం పట్ల తమకు నిబద్ధత ఉందని, భారత మార్కెట్ పట్ల తమకు విశ్వాసం ఉందనడానికి తాము పెడుతున్న భారీ పెట్టుబడులే నిదర్శనమని ఆయన పునరుద్ఘాటించారు. పుణెలో ఏర్పాటు చేయనున్న యూనిట్ 5 లక్షల రిఫ్రిజిరేటర్లను, 6 లక్షల వాషంగ్ మెషీన్లను, మరో 10 లక్షల వాటర్ అప్లయెనె్సస్‌ను తయారు చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుందని, ఇక్కడ ఉత్పత్తి అయ్యే గృహోపకరణాలతో భారత్ డిమాండ్‌ను తీర్చడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం కూడా ఉంటుందని ఆయన తెలిపారు.