బిజినెస్

టెలికామ్‌పై ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: టెలికామ్ ఆపరేటర్ల నుంచి వసూలు చేస్తున్న పన్ను రేటును వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) చట్టం కింద మరో 3 శాతం పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర టెలికామ్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా గురువారం స్పష్టం చేశారు. దేశంలో వివిధ రకాల పరోక్ష పన్నులను ఒకే ఛత్రం కిందికి తీసుకొచ్చి వస్తు, సేవల పన్ను చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వం జూలై 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా దీనిని అమలులోకి తీసుకురావాలని నిశ్చయించుకుని జిఎస్‌టి పరిధిలోని దాదాపు అన్ని వస్తువులు, సేవల పన్ను రేట్లను ఇప్పటికే ఖరారు చేసిన విషయం విదితమే. దీంతో జూలై 1వ తేదీ తర్వాత దేశంలో ఫోన్ టారిఫ్‌లు పెరగడం ఖాయమని టెలికామ్ ఆపరేటర్లతో పాటు వివిధ వర్గాల నుంచి భయాందోళనలు వ్యక్తమవుతుండటంతో మనోజ్ సిన్హా స్పందించారు.