బిజినెస్

రిటైల్ మార్కెట్ విస్తరణ దిశగా మెడ్‌ప్లస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: రిటైల్ ఔషధాల విక్రయ సంస్థ మెడ్‌ప్లస్ హెల్త్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన వ్యాపార విస్తరణలో భాగంగా ఫ్రాంఛైజీ పద్ధతిలో రిటైల్ మార్కెట్‌ను మరింత పటిష్ఠం చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సిఇఒ మధుకర్ గంగాడి గురువారం ఈ మేరకు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)తో తాము చేసుకున్న ఒప్పందం మేరకు ఫ్రాంఛైజీ యజమానులకు అవసరానికి అనుగుణంగా రుణాలు మంజూరు చేయించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు ఫ్రాంఛైజీ యజమానులకు అవసరమైన సహకారాన్ని తమ బృందం అందిస్తుందని చెప్పారు. ఒక ఫ్రాంఛైజీకి 300 నుంచి 500 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుందని, పెట్టుబడిగా రూ. 20 లక్షలు కావాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ మొత్తంలోనే ఫ్రాంఛైజీ ఫీ, అద్దె డిపాజిట్, వౌలిక సదుపాయాలు, కంప్యూటర్లు, స్టాక్, స్టోర్ ప్రారంభ ఖర్చు అన్నీ కలిసి ఉంటాయని తెలిపారు. మొత్తం రూ. 20 లక్షల్లో 70 శాతం ఎస్‌బిఐ రుణంగా అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ తరహా వ్యాపార విస్తరణ ద్వారా తెలంగాణ, ఎపిల్లో దాదాపు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) నుంచే ఫ్రాంఛైజీ స్థాయి వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.