బిజినెస్

దేశ ఆర్థిక వ్యవస్థకు విస్తృత ప్రయోజనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: చరిత్రాత్మకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రయోజనాలు ఒనగూడుతాయని భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (్ఫక్కీ) గురువారం స్పష్టం చేసింది. స్వతంత్ర భారత దేశంలో అతిపెద్దది, అత్యంత కీలకమైనది అయిన ఈ పన్ను సంస్కరణ విజయవంతంగా అమలు కావాలని ఆకాంక్షిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామని ఫిక్కీ తెలిపింది. జిఎస్‌టి అమలుతో పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం లభించడంతో పాటు నల్లధనం ఉత్పత్తి తగ్గుతుందని ఫిక్కీ పేర్కొంది.