బిజినెస్

మాల్యాకు మరోసారి నాన్ బెయిలబుల్ వారెంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: రుణపీడిత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత, లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాకు, ఆ సంస్థకు చెందిన సీనియర్ అధికారి ఏ రఘునాథన్‌కు మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేస్తూ నాంపల్లి మూడవ ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. జిఎంఆర్ సంస్థకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. శంషాబాద్ విమానాశ్రయంలో కింగ్‌ఫిషర్ విమానాలకు జిఎంఆర్ సంస్థ సేవలు అందించింది. దీనికి 50 లక్షల రూపాయల చెక్‌లను మాల్యా ఇవ్వగా, అవి బౌన్స్ అయ్యాయి. దీంతో ఈ నెల 5న కోర్టుకు హాజరు కావాలని గత నెల ఆఖరులో ఇదే కోర్టు మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో గురువారం కేసు విచారణకు రాగా, కర్నాటక పోలీసులు హాజరై కోర్టుకు నివేదిక ఇచ్చారు. ఈ ఆదేశాలను బెంగళూరులోని విజయమాల్యా ఇంటికి పంపించామని, కానీ వీటిని అమలు చేయలేకపోయామని పోలీసులు తెలిపారు. దీంతో మరోసారి నాన్ బెయలబుల్ వారెంట్‌నును జారీ చేస్తూ ఈ కేసు విచారణను జూన్ 7కు కోర్టు వాయిదా వేసింది.