బిజినెస్

3 నెలల గరిష్ఠానికి విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: దేశీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. జనవరి మినహా, ఫిబ్రవరి నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతూనే ఉన్నాయ. గత నెలలో కూడా 4.55 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయ. జూన్‌లో మొత్తం 29 వేల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చారు విదేశీ మదుపరులు. అయతే స్టాక్ మార్కెట్లలోకి స్వల్ప మొత్తంలో పెట్టుబడులను తీసుకురాగా, రుణ మార్కెట్లలోకి మాత్రం పెద్ద ఎత్తున పట్టుకొచ్చారు. స్టాక్ మార్కెట్లలోకి 3,617 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు రాగా, రుణ మార్కెట్లలోకి 25,685 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయ. దీంతో నికర పెట్టుబడుల విలువ 29,302 కోట్ల రూపాయలుగా నమోదైంది. కాగా, మార్చిలో రికార్డు స్థాయలో 57 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ మదుపరులు పట్టుకొచ్చారు. అనంతరం మళ్లీ జూన్‌లోనే అధికంగా పెట్టుబడులు వచ్చాయ. దీంతో గత నెల మూడు నెలల గరిషాఠన్ని తాకినట్లైంది. ఏప్రిల్‌లో దాదాపు 23 వేల కోట్ల ఠూపాయల పెట్టుబడులు రాగా, మే నెలా సుమారు 25 వేల కోట్ల రూపాయలు వచ్చాయ. ఫిబ్రవరిలో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 15,862 కోట్ల రూపాయలుగా ఉంటే, జనవరిలో మాత్రం 3,500 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపోయాయ. కాగా, ఫిబ్రవరి-జూన్ మధ్య వచ్చిన పెట్టుబడుల విలువ 1.62 లక్షల కోట్ల రూపాయలను దాటింది. మరోవైపు ఈ మార్చి 31తో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లలోకి 56,000 కోట్ల రూపాయలు రాగా, రుణ మార్కెట్ల నుంచి 7,000 కోట్ల రూపాయల ఉపసంహరణ జరిగింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం దేశంలోకి వచ్చిన నికర విదేశీ పెట్టుబడుల విలువ దాదాపు 49,000 కోట్ల రూపాయలుగానే ఉంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి 1.47 లక్షల కోట్ల రూపాయల(22.65 బిలియన్ డాలర్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయ. కాగా, 2016లో భారతీయ మార్కెట్ల నుంచి 23,079 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయా య. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేవలం నవంబర్‌లోనే సుమారు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న మదుపరులు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు మధ్య డిసెంబర్‌లో దాదాపు 4 బిలియన్ డాలర్లు, అంతకుముందు అక్టోబర్‌లో 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను గుంజేశారు. దీంతో నిరుడు చివరి మూడు నెలల్లో భారతీయ మార్కెట్ల నుంచి తరలిపోయన ఎఫ్‌పిఐ పెట్టుబడుల విలువ 12 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయతే నిరుడు జూలై-సెప్టెంబర్‌లో విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్లలోకి 46,000 కోట్ల రూపాయల పెట్టుబ డులను తెచ్చారు. ఇక జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబ డులను లాగేసుకున్నారు. ఇలా 2016 సంవత్సరం మొత్తంగా స్టాక్ మార్కెట్లలోకి 20,566 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్ల నుంచి 43,645 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం స్టాక్ మార్కెట్ల కంటే రుణ మార్కెట్లలోనే పెట్టుబడులకు విదేశీ మదుపరులు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం.