బిజినెస్

డిటర్జెంట్ ధరలను తగ్గించిన హెచ్‌యుఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) తమ ఉత్పత్తుల్లో కొన్నింటి ధరలను తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో డిటర్జెంట్లు, సబ్బుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులకు జిఎస్‌టి ప్రయోజనాలను అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ అధికార ప్రతినిధి పిటిఐకి తెలిపారు. 250 గ్రాముల రిన్ బార్ ధర 18 రూపాయల నుంచి 15 రూపాయలకు తగ్గగా, 10 రూపాయల సర్ఫ్ ఎక్సెల్ బార్ బరువును 95 గ్రాముల నుంచి 105 గ్రాములకు పెంచింది. అలాగే డౌ సోప్ బరువును 33 శాతం పెంచింది. మరోవైపు ఉత్పత్తులపై మార్జిన్ (మిగులు లేదా లాభం)ను పెంచాలంటూ మాడ్రన్ రిటైల్ ఔట్‌లెట్ల నుంచి వస్తున్న డిమాండ్లపై సంస్థ స్పందించలేదు.