బిజినెస్

జిఎస్‌టితో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: మూడీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో భారతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది. దేశ జిడిపి వృద్ధిరేటు పెరుగుతుందన్న మూడీస్.. పన్నుల ద్వారా ఖజానాకు ఆదాయం కూడా అధికమవుతుందని చెప్పింది. ఈ క్రమంలో భారత్.. విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించగలదని, ఇది దేశ క్రెడిట్ రేటింగ్ పెరగడానికి దోహదపడుతుందని మూడీస్ ఉపాధ్యక్షుడు (సావరిన్ రిస్క్ గ్రూప్) విలియం ఫాస్టర్ అన్నారు.
మరోవైపు రియల్ ఎస్టేట్ రంగానికి జిఎస్‌టితో పెద్దగా లాభం లేకుండా పోయింది. అపార్టుమెంట్లలో నివాసానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్ల ధరలు పెరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఉన్న అమ్ముడవ్వని ఫ్లాట్లపై కొనుగోలుదారుల నుంచే అధిక పన్ను వసూలు చేయాలని డెవలపర్లు యోచిస్తుండటమే ఇందుకు కారణం. జిఎస్‌టిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై పన్ను 12 శాతానికి పెరిగింది. జిఎస్‌టి రాకతో ఇది 6.5 శాతం ఎగబాకింది. మొత్తం రియల్ ఎస్టేట్‌పై వాస్తవిక జిఎస్‌టి రేటు స్థూలంగా 18 శాతంగా ఉంది.