బిజినెస్

జిఎస్‌టితో పెరగనున్న కేంద్ర పన్నుల రాబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర పన్నుల రాబడి ఈ ఏడాది 14.5 శాతం పెరగవచ్చని హైదరాబాద్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీసు ట్యాక్స్ కమిషనర్ సునీల్ జైన్ అన్నారు. జిఎస్‌టి వల్ల ఈ రాబడి పెరుగుతుందనే విశ్వాసం ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘రాష్ట్రంలో నిరుడు కేంద్ర, రాష్ట్రాలకు 50 వేల కోట్ల రూపాయల వరకు పన్ను రూపేణా ఆదాయం వచ్చింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వల్ల ఈ ఆదాయం 14.5 శాతం పెరుగుతుంది. సేవా పన్ను, విలువ ఆధారిత పన్ను, అమ్మకం పన్నును ఏకీకృత పన్ను విధానం క్రిందకు తేవడం వల్ల పన్ను ఆదాయం పెరగనుంది.’ అన్నారు. జిఎస్‌టిలో సిజిఎస్‌టి, ఎస్‌జిఎస్‌టి ఉన్నాయని, అయతే దీనిపై గందరగోళం అక్కర్లేదన్నారు. ఒక వస్తు విక్రయంపై 18 శాతం పన్ను విధిస్తే కేంద్రానికి 9 శాతం, రాష్ట్రానికి 9 శాతం పన్ను రూపంలో ఆదాయం వస్తుందన్నారు. కాగా, 81 శాతం వరకు సరుకులు, వస్తువులపై పన్ను 18 శాతానికి లోపలే ఉందన్నారు. సేవా పన్ను, కేంద్ర పన్ను, విలువ ఆధారిత పన్ను క్రింద మొత్తం 3.7 లక్షల మంది ట్రేడర్లు ఉన్నారన్నారు. ఇందులో 86 శాతం మంది జిఎస్‌టికి మారారని, రాష్ట్రంలో 40 వేల మంది ట్రేడర్లు, మ్యానుఫ్యాక్చరర్ల వార్షిక టర్నోవర్ 20 లక్షల రూపాయల లోపేనని, వీరిని జిఎస్‌టి నుంచి మినహాయించారని పేర్కొ న్నారు. జిఎస్‌టిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర జిఎస్‌టి, హైదరాబాద్ జిఎస్‌టిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. జిఎస్‌టిలోకి వ్యాపారులు మారడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా 146 జిఎస్‌టి సేవా కేంద్రాలను సెంట్రల్ ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసింది.