బిజినెస్

లాభాల్లో ‘హీరో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: దేశీయ ఆటోరంగ దిగ్గజం, ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో గణనీయంగా పెరిగింది. 70.85 శాతం ఎగిసి 814.16 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 476.53 కోట్ల రూపాయలుగా ఉంది. నికర అమ్మకాలు 10.3 శాతం వృద్ధి చెంది ఈసారి 7,385.23 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 6,695.19 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఈ జనవరి-మార్చిలో 17,21,240 ద్విచక్ర వాహనాలను హీరో మోటోకార్ప్ అమ్మినట్లు గురువారం ప్రకటించింది. నిరుడు 15,75,501 యూనిట్లను విక్రయించింది. ఇదిలావుంటే మొత్తం గత ఆర్థిక సంవత్సరం సంస్థ నికర లాభం 3,132.37 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది 2,385.64 కోట్ల రూపాయలుగా ఉంది. నికర అమ్మకాలు కూడా క్రిందటిసారితో పోల్చితే 27,350.60 కోట్ల రూపాయల నుంచి 28,160.48 కోట్ల రూపాయలకు పెరిగాయి. 2015-16లో 66,32,322 యూనిట్ల అమ్మకాలు జరగగా, 2014-15లో 66,31,826 యూనిట్ల విక్రయాలు నమోదైనట్లు సంస్థ తెలియజేసింది. ఇక హీరో మోటోకార్ప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ పవన్ ముంజల్ మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2015-16 ఆర్థిక సంవత్సరంతో మార్కెట్ లీడర్‌గా హీరో మోటోకార్ప్ ప్రస్థానం ఐదేళ్లను పూర్తి చేసుకుందన్నారు. కాగా, 2015-16కుగాను 2 రూపాయల ముఖవిలువ కలిగిన ప్రతీ ఈక్విటీ షేర్‌కు 32 రూపాయల తుది డివిడెండ్‌ను గురువారం సమావేశమైన సంస్థ బోర్డు ఆమోదించింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో హీరో మోటోకార్ప్ షేర్ విలువ బుధవారం ముగింపుతో పోల్చితే గురువారం 0.13 శాతం క్షీణించి 2,893.95 రూపాయల వద్ద ముగిసింది.