బిజినెస్

దిగొస్తున్న వాహన ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి రావడంతో దాని ప్రయోజనాలను వాహన వినియోగదారులకు అందిస్తున్నాయి ఆటో రంగ సంస్థలు. ఒక్కొక్కటిగా ధరల తగ్గింపును ప్రకటిస్తున్నాయి. శనివారం మారుతి, టొయోట, జెఎల్‌ఆర్, బిఎమ్‌డబ్ల్యు తమ కార్ల ధరలను తగ్గించగా, ఆదివారం హీరో మోటోకార్ప్ తమ బైక్‌ల ధరలను దించింది. సోమవారం హోండా, ఫోర్డ్, టివిఎస్, సుజుకి సంస్థలు తమ బైక్, కార్ల ధరలపై కోత విధించాయి.
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకి.. ఆల్టో 800 ధరను 2,300 రూపాయల నుంచి 5,400 రూపాయల వరకు తగ్గించగా, వాగనార్ ధరను 5,300 రూపాయల నుంచి 8,300 రూపాయల వరకు, స్విఫ్ట్ ధరను 6,700 రూపాయల నుంచి 10,700 రూపాయల వరకు, బాలెనో ధరను 6,600 రూపాయల నుంచి 13,100 రూపాయల వరకు, డిజైర్ ధరను 8,100 రూపాయల నుంచి 15,100 రూపాయల వరకు, ఎర్టిగా పెట్రోల్ వెర్షన్ ధరను 21,800 రూపాయలు, సియాజ్ పెట్రోల్ వెర్షన్ ధరను 23,400 రూపాయలు తగ్గించింది. ఎస్‌యువి విటారా బ్రీజా ధరను కూడా 10,400 రూపాయల నుంచి 14,700 రూపాయల వరకు, ఎస్-క్రాస్ ధరను 17,700 రూపాయల నుంచి 21,300 రూపాయల వరకు తగ్గించింది. ఎక్స్‌షోరూం ధరలపై 3 శాతం వరకు ధరలను తగ్గించినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. అయితే స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగిన ఎర్టిగా, సియాజ్ ధరలు పెరుగుతాయని, జిఎస్‌టిలో మైల్డ్ హైబ్రిడ్ వాహనాలపై పన్ను రాయితీల ఉపసంహరణే ఇందుకు కారణమని మారుతి చెప్పింది. మారుతి కార్ల కనిష్ట ధర 2.46 లక్షల రూపాయలుగా, గరిష్ఠ ధర 12.03 లక్షల రూపాయలుగా ఉంది. ఇక టొయోట కిర్లోస్కర్ తమ ఫార్చునర్ ధరను (బెంగళూరు ఎక్స్‌షోరూం ప్రకారం) ఏకంగా 2.17 లక్షల రూపాయలు తగ్గించింది. ఇన్నోవా క్రిస్టా ధరనూ 98,500 రూపాయలు దించగా, కరోల్లా ఆల్టిస్ ధరను 92,500 రూపాయలు తగ్గించింది. అలాగే ప్లాటినమ్ ఎషియోస్ ధరను 24,500 రూపాయలు, ఎషియోస్ లివా ధరను 10,500 రూపాయల వరకు కోతేసింది. అయితే బెంగళూరు మార్కెట్ ప్రకారం క్యామ్రీ ధరను 3.5 లక్షల రూపాయలకుపైగా, ఢిల్లీ మార్కెట్ ప్రకారం ప్రియస్ ధరను 5.24 లక్షల రూపాయల వరకు పెంచింది టొయోట.
మరోవైపు జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యు కూడా తమ కార్ల ధరలను తగ్గించింది. బేసిక్ మోడల్ ఎక్స్1 వెర్షన్‌పై 70,000 రూపాయలు, టాప్ ఎండ్ మోడల్ సెడాన్ 7 సిరీస్‌పై లక్షా 80,000 రూపాయలు తగ్గించింది. అయితే హైబ్రిడ్ మోడల్ ఐ8 ధరను 4.8 లక్షల రూపాయలు పెంచింది. దీంతో దీని ధర 2.28 కోట్ల రూపాయలకు చేరింది. ఇక దేశీయ ఆటో రంగ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్.. జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) సైతం తమ వాహనాల ధరలను 7 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ మార్కెట్‌లో ఎక్స్‌ఇ, ఎక్స్‌ఎఫ్, ఎఫ్-పేస్, ఎక్స్‌జె మోడళ్లను జాగ్వార్ విక్రయిస్తుండగా, వీటి కనిష్ట ధర 34.64 లక్షల రూపాయలు, గరిష్ఠ ధర 97.39 లక్షల రూపాయలుగా ఉంది.
అలాగే లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ప్రారంభ ధర 40.04 లక్షల రూపాయలు, రేంజ్ రోవర్ ఎవోక్ ధర 42.37 లక్షల రూపాయలు, స్పోర్ట్ ఆరంభ ధర 89.44 లక్షల రూపాయలుగా ఉంది. రేంజ్ రోవర్ శ్రేణిలో ప్రారంభ ధర 1.59 కోట్ల రూపాయలుగా కూడా ఉన్న మోడల్స్ ఉన్నాయి.
విదేశీ ఆటో రంగ సంస్థ ఫోర్డ్ కూడా వాహన ధరలను తగ్గించగా, వివిధ రకాల మోడళ్లపై 3 లక్షల రూపాయల వరకు ధరలు తగ్గాయి. ఫిగో ధర 2,000 రూపాయలు, ఎస్‌యువి ఎకోస్పోర్ట్ ధర 8,000 రూపాయల వరకు, ప్రీమియం ఎస్‌యువి ఎండీవర్ ధర 1.5 లక్షల రూపాయల వరకు తగ్గాయి. ముంబయిలో ఫిగో ధర 28,000 రూపాయలు, ఎండీవర్ ధర 3 లక్షల రూపాయలు తగ్గడం గమనార్హం. ఎక్స్‌షోరూం ప్రకారం ఫోర్డ్ కార్ల కనిష్ట ధర 4.75 లక్షల రూపాయలు, గరిష్ఠ ధర 31.5 లక్షల రూపాయలుగా ఉంది. హోండా కార్స్ ఇండియా కూడా తమ వాహన ధరలను 1.31 లక్షల రూపాయల వరకు తగ్గించింది. హచ్‌బ్యాక్ బ్రియో ధర 12,279 రూపాయల వరకు, కంపాక్ట్ సెడాన్ అమేజ్ ధర 14,825 రూపాయల వరకు, జాజ్ ధర 10,031 రూపాయల వరకు, డబ్ల్యుఆర్-వి ధర 10,064 రూపాయల వరకు, సెడాన్ సిటీ ధర 16,510 రూపాయల నుంచి 28,005 రూపాయల వరకు, బిఆర్-వి ధర 30,387 రూపాయల వరకు, ప్రీమియం ఎస్‌యువి సిఆర్-వి ధర 1,31,663 రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
ఇక ద్విచక్ర వాహన విభాగంలో హీరో మోటోకార్ప్ కూడా వాహన ధరలను తగ్గించింది. వివిధ రకాల మోడళ్లపై కనిష్టంగా 400 రూపాయల నుంచి గరిష్ఠంగా 1,800 రూపాయల వరకు ధరలను తగ్గించింది హోండా మోటార్‌సైకిల్ సైతం తమ టూవీలర్ల ధరలను 5,500 రూపాయల వరకు తగ్గించింది. అలాగే టివిఎస్ మోటార్ తమ టూవీలర్ల ధరలను 4,150 రూపాయల వరకు తగ్గించింది. కమ్యూటర్ విభాగంలో ధరల తగ్గింపు 300 రూపాయల నుంచి 1,500 రూపాయల వరకు ఉంది. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, యమహా సంస్థలూ తమతమ ద్విచక్ర వాహనాల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కాగా, గత నెల జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, ఆడీ కూడా తమ కస్టమర్లకు జిఎస్‌టి ప్రయోజనాలను ప్రకటించాయి. జిఎస్‌టిలో 1,500 సిసి సామర్థ్యానికి పైనున్న భారీతరహా లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్స్ (ఎస్‌యువి)పై 28 శాతం పన్ను విధించారు. మరో 15 శాతం సెస్ అదనంగా వేశారు. అయినప్పటికీ గతంలో పడిన పన్ను కంటే ఇది తక్కువే. ఇంతకుముందు దాదాపు 50 శాతం పన్నుండేది. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో దేశవ్యాప్తంగా శనివారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ పరోక్ష పన్నుల విధానం (జిఎస్‌టి)లో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు.
విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ తదితర 16 వేర్వేరు పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు. దీనివల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుండగా, జిఎస్‌టి అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తొలి ఐదేళ్లు నష్టపరిహారం కూడా ఇస్తామని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే లగ్జరీ, ఆరోగ్యానికి హానికరం చేసే ఉత్పత్తులపై 43 శాతం వరకు అదనంగా పన్ను భారాన్ని మోపింది నరేంద్ర మోదీ సర్కారు.