బిజినెస్

ఇదంతా జియో వల్లే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్).. ముకేశ్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌పై మంగళవారం విరుచుకుపడింది. దేశీయ టెలికామ్ రంగం సంక్షోభంలో చిక్కుకోవడానికి జియోనే కారణమంటూ మండిపడింది. నిరుడు సెప్టెంబర్‌లో దేశీయ టెలికామ్ రంగంలో సంచలనం సృష్టిస్తూ 4జి సేవలను జియో ఆరంభించినది తెలిసిందే. తొలుత డిసెంబర్ 31దాకా, ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 31వరకు ఉచిత 4జి సేవలను అందించింది. ఈ క్రమంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తోపాటు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ తదితర ఇతర టెలికామ్ సంస్థల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. మార్కెట్‌లో జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి అన్ని సంస్థలూ డేటా, కాల్స్ రేట్లపై కోతలు పెట్టాయి. దీంతో ఈ ఉచిత ఆఫర్లు మొత్తం టెలికామ్ రంగానే్న కుదేలు చేశాయంటూ దీనికి కారణమైన జియోపై దుమ్మెతిపోసింది ఆర్‌కామ్.
తమ సంస్థ రుణభారం మోయలేనంతగా తయారుకావడానికీ ఇదే కారణమంది. ఆదాయం తగ్గి, రుణాలు పెరగడం వల్ల సంస్థ మార్కెట్ విలువను రుణాల విలువ మించిపోయిందని వాపోయింది. మూడు నెలలకుపైగా చెల్లింపులు ఆలస్యమయ్యా యని దేశీయ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లకు తెలిపింది.
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆర్‌కామ్‌కు ఆ భారాన్ని తగ్గించుకోవడానికి రుణ దాతలు ఏడు నెలల సమయం ఇచ్చినది తెలిసిందే. సంస్థ పొందిన రుణాలు 45,000 కోట్ల రూపాయలకు చేరిన నేపథ్యంలో వివిధ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు ఆర్‌కామ్ క్రెడిట్ రేటింగ్‌ను దారుణంగా తగ్గించేశాయి. ఇది తనను చాలాచాలా బాధించిందంటూ రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ గతంలోనే వ్యాఖ్యానించారు. డిసెంబర్ 31 వరకు రుణ దాతలు (బ్యాంకర్లు) తమకు సమయం ఇచ్చారని, ఒకవేళ ఈ గడువులోగా రుణాలను చెల్లించనిపక్షంలో ఎలాంటి నిర్ణయమైన తీసుకునే హక్కు రుణ దాతలకు ఉంటుందని కూడా అనిల్ ఈ సందర్భంగా స్పష్టం చేయడం గమనార్హం. ఆర్‌కామ్ ఆస్తులను విక్రయిస్తున్నామన్న ఆయన సెప్టెంబర్‌లోకల్లా ఎయిర్‌సెల్‌తో విలీనం, టెలికామ్ టవర్ ఆస్తుల అమ్మకానికి సంబంధించిన రెండు ఒప్పందాలతో రుణ భారం 20,000 కోట్ల రూపాయలకు తగ్గగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఈ రుణ భారాన్ని కూడా తగ్గించుకోవడానికి చివరకు అంతర్జాతీయ వ్యాపారాలనూ అమ్మటానికి సిద్ధమని అనిల్ ప్రకటించారు. దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థల్లో ఒకటైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ గత ఆర్థిక సంవత్సరానికి (2016-17) గాను 1,285 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) లో 660 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఈ నేపథ్యంలో జియో తీరుపై ఆర్‌కామ్ మండిపడగా, ఇదిప్పుడు ప్రాధాన్యతను సంతరిం చుకుంది. ఇప్పటిదాకా జియో ఆఫర్లపై ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియానే ప్రత్యక్ష యుద్ధం సాగిస్తున్నాయ. అలాంటిదిప్పుడు ఆర్‌కామ్ కూడా అదే బాటలోకి వచ్చింది. నిజానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ దుస్థితికి జియోనే ప్రధాన కారణమని ఆ సంస్థ సిఎఫ్‌ఒ పునిత్ గార్గ్ గతంలోనే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశీయ టెలికామ్ రంగం ఇబ్బందుల్లో ఉందన్న ఆయన ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ ఏడాది 40,000 ఉద్యోగాలు పోయే ప్రమాదముందనీ హెచ్చరించారు. ఆర్‌కామ్ షేర్ విలువ మంగళవారం బిఎస్‌ఇ ట్రేడింగ్‌లో సోమవారంతో పోల్చితే 4.35 శాతం పడిపోయ 20.9 రూపాయల వద్ద స్థిరపడింది.