బిజినెస్

కోలుకున్న స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 5: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. వరుసగా మూడు రోజులు నష్టపోయిన సూచీలు.. మదుపరుల కొనుగోళ్లతో తిరిగి లాభాలను అందుకోగలిగాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 160.48 పాయింట్లు పుంజుకుని 25,262.21 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 28.95 పాయింట్లు పెరిగి 7,735.50 వద్ద నిలిచింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, డాలర్‌తో పోల్చితే 10 పైసలు పెరిగిన రూపాయి మారకం విలువ.. మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక బిల్లు 2016లో 55 సవరణలు చేసిన అనంతరం లోక్‌సభలో సదరు బిల్లు ఆమోదం పొందింది. ఈ ప్రభావం కూడా మదుపరులపై కొంత కనిపించిందని మార్కెట్ నిపుణులు గురువారం నాటి ట్రేడింగ్ సరళిని విశే్లషిస్తున్నారు. ఇకపోతే క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్, ఎఫ్‌ఎమ్‌సిజి, ఆటో, పవర్, ఫైనాన్స్, మెటల్ రంగాల షేర్ల విలువ 1.60 శాతం నుంచి 0.33 శాతం పెరిగింది. అయితే టెలికామ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, గ్యాస్ రంగాల షేర్ల విలువ 1.81 శాతం నుంచి 0.16 శాతం మేర తగ్గింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, సింగపూర్, తైవాన్ సూచీలు 0.19 శాతం నుంచి 0.37 శాతం పెరిగాయి. చైనా సూచీ కూడా 0.22 శాతం పెరిగింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు కూడా 0.18 శాతం నుంచి 0.59 శాతం వరకు లాభాలను అందుకున్నాయి.