బిజినెస్

ఫార్మా రంగంలో అపార అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: హైదరాబాద్ నగరం ఫార్మాస్యుటికల్ హబ్‌గా రూపాంతరం చెందుతున్నందున రసాయన శాస్త్రంలో పట్టు సాధించిన విద్యార్థులకు అపార అవకాశాలు ఉన్నాయని గీతం విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్‌లో మూడేళ్ల బిఎస్సీ కోర్సును ఆయన మంగళవారం ప్రారంభించారు. పాఠ్యాంశాలను, వాటిలోని ప్రాథమిక సూత్రాల ను విద్యార్థులు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని సూచించారు. తరగతి గదిలో వచ్చేసందేహాలను తక్షణమే నివృత్తి చేసుకోవాలని, ప్రయోగ శాలల్లో అనుభవ పూర్వకంగా నేర్చుకోవాలని చెప్పారు. సైన్స్ కోర్సుల్లో రాణించిన విద్యార్థులకు జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు వచ్చే వీలుందని, ఆ తర్వాత పరిశోధనలు చేపట్టవచ్చని ఆయన తెలిపారు. ఏ దశలో అవసరమైన జ్ఞానాన్ని ఆ స్థాయిలో ఇష్టంతో కష్టపడి సాధించుకోవాలని, అంతే తప్ప వైద్య లేదా సాంకేతిక విద్యను అభ్యసించలేకపోయామనే ఆత్మన్యూనత సరికాదని అన్నారు. క్రమశిక్షణ లేకుండా జీవితంలో ఎదుగుదల సాధ్యపడదని, కష్టపడకుండా ఏదీ సాధించలేమని ప్రిన్సిపాల్ జిఎ రామారావు అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.