బిజినెస్

దక్షిణ మధ్య రైల్వేకు రెండు జాతీయ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: దక్షిణ మధ్య రైల్వే మరో రెండు అరుదైన జాతీయ అవార్డులు దక్కించుకుంది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని రాయనపాడు వాగన్ వర్కుషాపు, సికిందరాబాద్ రైల్వే డివిజన్‌లో సూపర్‌వైజర్ల శిక్షణ కేంద్రానికి ఈ అవార్డులు లభించాయి. రాయలపాడు వర్కుషాపు జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది బెస్ట్ వర్కుషాపు 2016-17 షీల్డ్‌ను కైవసం చేసుకుంది. అదేవిధంగా అంతర్జాతీయ వెల్డింగ్ సర్ట్ఫికేషన్ ఐఎస్ 3834, ఐఎస్‌ఓ 50001 (విద్యుత్ ఆదా) సర్ట్ఫికేట్‌ను సాధించింది. ఇక సికిందరాబాద్ సూపర్‌వైజర్ల ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను బెస్ట్ ట్రైనింగ్ సెంటర్‌గా ఇండియన్ రైల్వే గుర్తించింది. ఈ అవార్డులను ఇండియన్ రైల్వే చీఫ్ మెకానికల్ ఇంజనీర్, చీఫ్ వర్కుషాపు ఇంజనీర్ అర్జున్ ముండియా, కెపి సోమ్‌కుమార్‌లు మంగళవారం సికిందరాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా జిఎం యాదవ్ మాట్లాడుతూ కార్మికులు, అధికారుల సమష్టి కృషి ఫలితంగానే ఈ అవార్డులు దక్కాయన్నారు. ఈ సందర్భంగా వారు సిబ్బందిని అభినందించారు.

చిత్రం.. అవార్డు అందుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్