బిజినెస్

తొలిసారిగా భీమ్ యాప్‌తో స్మార్ట్ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) భాగస్వామ్యంతో భారతీయ మొబైల్ తయారీ సంస్థ అయిన కార్బన్ మొబైల్స్.. దేశంలోనే తొలిసారిగా ‘్భమ్’ డిజిటల్ పేమెంట్ యాప్‌తో ఓ స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. కె9 కవాచ్ 4జి పేరుతో విడుదలైన దీని ధర 5,290 రూపాయలు. ఆన్‌లైన్‌తోపాటు, ఆఫ్‌లైన్ మార్కెట్‌లో ఇదే ధర ఉంటుందని కార్బన్ మొబైల్స్ మంగళవారం తెలిపింది. కాగా, నిరుడు నవంబర్ 8న పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆన్‌లైన్ లావాదేవీలకు ఊతమిచ్చే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. డిసెంబర్‌లో భీమ్ (్భరత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ)యాప్‌ను ఆవిష్కరించినది తెలిసిందే. గత ఆరు నెలల్లో రెండున్నర కోట్ల మంది ఈ యాప్‌ను తమతమ స్మార్ట్ఫోన్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ క్రమంలో కార్బన్ మొబైల్స్ తమ నూతన స్మార్ట్ఫోన్‌లోనే ఆ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అధునాతన ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ వ్యవస్థతో వచ్చిన కె9 కవాచ్ 4జిలో 5 అంగళాల డిస్‌ప్లే, 1.25 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జిబి ర్యామ్, 8జిబి ఇంటర్నల్ మెమరీ (మరో 32జిబి వరకు పెంచుకోవచ్చు), 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, 2,300 మెగాహెట్జ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్నాయి.