బిజినెస్

రియల్ ఎస్టేట్‌కు నీరసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ చట్టం రూపొందించడంపై అవలంభిస్తున్న వైఖరితో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో గృహ నిర్మాణంపై ప్రతికూల ప్రభావం పడినట్లు నైట్ ఫ్రాంక్ సంస్ధ ప్రకటించింది. 2016తో పోలిస్తే 2017లో 55 శాతం తక్కువగా గృహ నిర్మాణ ప్రాజెక్టులు ప్రారంభం తగ్గిందన్నారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాలు స్ధిరంగా ఉన్నాయని, సమీప భవిష్యత్తులో ఇదే పరిస్ధితి కొనసాగుతుందని నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్ధ డైరెకటర్ శాంసన్ ఆర్ధర్ చెప్పారు. కాని గృహ కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరిగినట్లు వెల్లడైందన్నారు. రెగ్యులేషన్ చట్టం రాకముందే గృహ నిర్మాణ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో రియల్టర్లు ఉన్నారన్నారు. 2017 చివరి నాటికి మెట్రో రైలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్నారు. హైటెక్ సిటీకి దగ్గరలో నూతన వెంచర్ల ఆవిష్కరణలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. 2016తో పోల్చితే 2017లో నాణ్యమైన ఆఫీస్ స్పేస్ లభ్యత లేని కారణంగా లావాదేవీలు తగ్గాయన్నారు. పూర్తయిన ఆఫీసు నిర్మాణాలు తగ్గిపోవడంతో 2016తో పోలిస్తే ఖాళీల పరిమితులు 9 శాతం పడిపోయాయన్నారు. అధిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలైన మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చ్భిలి, నానక్‌రామ్‌గుడలో ఖాళీల పరిమితులు 2 నుంచి 4 శాతానికి తగ్గిపోయాయన్నారు. ఇంటి అమ్మకాల్లో మొత్తం 69 శాతం హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాలైన నల్లగండ్ల, చందనగర్, లింగంపల్లి, కుకుట్‌పల్లి, నర్సింగి, హయత్‌నగర్, కోకాపేటల్లో జరిగాయన్నారు.