బిజినెస్

మాల్యా అప్పగింత వ్యవహారంపై డిసెంబర్‌లో తుది విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 6: తనను భారత్‌కు అప్పగించాలనే కేసు తుది విచారణను వచ్చే ఏడాదికి మార్చాలని ప్రస్తుతం బ్రిటన్‌లో తల దాచుకుని ఉన్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా అభ్యర్థనను బ్రిటన్ కోర్టు గురువారం తిరస్కరించడమే కాక డిసెంబర్ 4కు విచారణ తేదీని నిర్ణయించింది. ప్రస్తుతం మూతపడిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి దాదాపు 9 వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో భారత్‌లో విచారణను ఎదుర్కొంటున్న మాల్యా 2016 మార్చినుంచి బ్రిటన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. ఆయనను తమకు అప్పగించాలంటూ భారత్ చేసుకున్న అభ్యర్థనపై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు గత ఏడాది ఏప్రిల్‌లో ఆయనను అరెస్టు చేశారు కూడా. కాగా, గురువారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా భారత ప్రభుత్వం తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ న్యాయవాది మార్క్ సమ్మర్స్ వాదిస్తూ ఈ కేసులో తమకు భారత ఆధికారులనుంచి అద్భుతమైన సహకారం లభిస్తోందని, మాల్యాను భారత్‌కు అప్పగించడానికి సంబంధించి బలమైన కేసును సిద్ధం చేయడానికి తగిన సాక్ష్యాధారాలు ఇప్పుడు తమవద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ముందుకు వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని, వీలయినంత త్వరగా విచారణ తేదీని నిర్ణయించాలని కోర్టును కోరుతున్నామని ఆయన తెలిపారు. అయితే, సాక్ష్యాల కింద ఉపయోగపడే సమాచారం కొంత తమకు బుధవారం సాయంత్రమే అందిందని, దాన్ని పరిశీలించడానికి మరి కొంత సమయం ఇవ్వాలని మాల్యా తరఫు న్యాయవాదులు కోరారు. అయితే ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ఎమ్మా లూయిస్ అర్బుత్నాట్ కేసు తుది విచారణ తేదీని డిసెంబర్ 4గా నిర్ణయించారు.
ఎంసిఎఫ్‌ఎల్ బోర్డు డైరెక్టర్ పదవికి
మాల్యా తల్లి రాజీనామా
ఇదిలావుండగా, మంగళూరు కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స లిమిటెడ్ (ఎంసిఎఫ్‌ఎల్) బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవినుంచి విజయ్ మాల్యా మారుటి తల్లి రితూ మాల్యా రాజీనామా చేశారు. జూలై 6నుంచి రితు మాల్యా కంపెనీ డైరెక్టర్ల బోర్డునుంచి వైదొలగినట్లు ప్రస్తుతం సరోజ్ పొద్దార్ నేతృత్వంలోని జువారీ గ్రూపు కంట్రోల్‌లో ఉన్న ఈ సంస్థ బిఎస్‌ఇకి సమర్పించిన ఒక లేఖలో తెలిపింది. 2014లో విజయ్ మాల్యా ఈ కంపెనీ డైరెక్టర్ పదవికి మాల్యా రాజీనామా చేసిన కొద్ది రోజులకే ఆమె బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. ప్రస్తుతం జువారీ గ్రూపునకు ఈ కంపెనీలో 53 శాతం వాటా ఉండగా విజయ్ మాల్యాకు చెందిన యుబి గ్రూపునకు 22 శాతం వాటా ఉంది.

చిత్రం.. లండన్‌లో గురువారం వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరైన విజయ్ మాల్యా