బిజినెస్

అడుగడుగునా వైఫల్యాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) దారుణమైన వైఫల్యాలతో కూడుకొని ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం విమర్శించారు. ఏడు లేదా అంతకంటే ఎక్కువ పన్ను రేట్లు ఉన్న జిఎస్‌టిని ‘ఒకే దేశం, ఒకే పన్ను’గా పేర్కొనడం ఎంతమాత్రం సమజసం కాదని గురువారం న్యూఢిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. పెట్రోలియం, విద్యుత్, రియల్ ఎస్టేట్ రంగాలను వస్తు, సేవల పన్నులో చేర్చడంతో పాటు జిఎస్‌టి పన్ను రేట్లను తగ్గించి 18 శాతం పరిమితి విధించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘యుపిఎ ప్రభుత్వ హయాంలో మేము అనుకున్న జిఎస్‌టి ఇది కాదు. మోదీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన జిఎస్‌టి దారుణమైన వైఫల్యాలతో నిండి ఉంది. దాదాపు ఏడు రకాల పన్ను రేట్లను ఇందులో చేర్చి జిఎస్‌టిని అవహేళన చేశారు. 0.25 శాతం మొదలుకొని 3, 5, 12, 18, 28, 40 అంతకంటే ఎక్కువ శాతం పన్ను రేట్లతో అమలు చేస్తున్న జిఎస్‌టిని ఒకే దేశం, ఒకే పన్ను అని ఏవిధంగా సంబోధిస్తారు?’ అని చిదంబరం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.