బిజినెస్

సెనె్సక్స్ కొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 6: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ దాదాపు 124 పాయింట్లు లాభపడి 31,369 పాయింట్ల సరికొత్త ముగింపు రికార్డు నమోదు చేసింది. గత నెల 13-14 తేదీల్లో జరిగిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో ద్రవ్యోల్బణంపైన, అలాగే వడ్డీ రేట్ల పెంపుపైన విధాన కర్తల్లో ఎలాంటి ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదని సమావేశం వివరాలు వెల్లడించడం మార్కెట్ల జోష్‌కు ప్రధాన కారణమైంది. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే బలంగా మొదలైన సెనె్సక్స్ ఆ తర్వాత ఒక దశలో 31,460.70 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకినప్పటికీ చివరికి 123.78 పాయింట్ల లాభంతో 31,369.34 పాయింట్ల ఆల్‌టైమ్ హై వద్ద ముగిసింది. ఇంతకు ముందు జూన్ 19న సెనె్సక్స్ 31.311.57 పాయింట్ల ముగింపే రికార్డుగా ఉండింది. కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం ఒక దశలో తిరిగి 9,700 పాయింట్ల స్థాయిని చేరుకున్నప్పటికీ చివరికి 36.95 పాయింట్ల లాభంతో 9,674.55 పాయింట్ల వద్ద ముగిసింది. గత నెల 5 సాధించిన 9,675.10 పాయింట్ల లైఫ్‌టైమ్ రికార్డుకు ఇది అత్యంత చేరువలో ఉండడం గమనార్హం. వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) అమలు సాఫీగా జరిగి పోవడం, ఆర్థిక వృద్ధి మరింత బలపడవచ్చన్న ఆశలు, రుతుపవనాల పురోగతి ఇప్పటివరకు బాగానే ఉండడం లాంటి అంశాల కారణంగా మార్కెట్లు తిరిగి బుల్ ధోరణిలోకి వచ్చాయని ట్రేడర్లు అంటున్నారు.