బిజినెస్

వాణిజ్య అడ్డంకులు తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంబర్గ్, జూలై 7: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాలని, అంతర్జాతీయ వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్), ప్రపంచ బ్యాంక్, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) శుక్రవారం ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చాయి.
ఐఎమ్‌ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టినా లగార్డే, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్, డబ్ల్యుటిఒ ప్రధాన కార్యదర్శి రాబర్టో అజెవెడో ఇక్కడ జరుగుతున్న జి20 దేశాల సదస్సు సందర్భంగా ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కోట్లాది మంది ఆధారపడిన వాణిజ్య సేవలకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు లేకపోవడం వల్ల ఆయా దేశాల సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో విస్తరణకు నోచుకోలేకపోతున్నాయని చెప్పారు.
కొన్ని దేశాలు సాంకేతికంగా వెనకబడిపోవడం వల్ల అక్కడ నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని, ఉద్యోగవకాశాలు ఏర్పడటం లేదన్నారు. ఇదే కారణంతో చివరకు ఉద్యోగులు తమ ఉపాధిని కూడా కోల్పోతున్నారని అన్నారు. కాబట్టి సాంకేతికాభివృద్ధిపైనా దృష్టి పెట్టాలని సూచించారు.