బిజినెస్

తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 11: సుందర, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు ప్రపంచం ముందు ఉంచుతామని, తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాల్లో అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, వాటన్నింటినీ వెలుగులోకి తెచ్చి మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందులాల్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణానది తీరాన సోమశీల నుండి శ్రీశైలం వరకు పర్యాటకుల లాంచీని (పడవ) మంత్రులు చందులాల్, జూపల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు ప్రారంభించారు. అదేవిధంగా జటప్రోలు దగ్గర హరిత హారం హోటల్‌ను కూడా వారు ప్రారంభించారు. సోమశిల దగ్గర కృష్ణానదిలో లాంచిని ప్రారంభించిన మంత్రులు దాదాపు ఎనిమిది కిలోమీటర్లకు పైగా కృష్ణానదిలో లాంచిపైన ప్రయాణం చేసి, కృష్ణానది ప్రాంతంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలను తిలకించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందులాల్ మాట్లాడుతూ కృష్ణమ్మ ఒడిలో పాపి కొండలను తలపించే సోయగాలు ఎన్నో ఉన్నాయని వాటిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు తొలి అడుగు పడిందని అన్నారు. తెలంగాణలోని కృష్ణానది తీరాన అద్భుతమైన పర్యాటక ప్రపంచం దాగుందన్నారు. దీన్ని దేశ, విదేశీ పర్యాటకులు ఆకర్షించే విధంగా ప్రచారం చేస్తామని, ఇక్కడికి వచ్చి ఈ దృశ్యాలను తిలకించేలా అభివృద్ది చేస్తామన్నారు. నల్లమల ఆటవీ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయని, అక్కమాంబ, కందివనం, సోమశీల, ఉమామహేశ్వరం, మద్దిమడుగు, జోగులాంబదేవి ఆలయాలు ఎంతో చారిత్రత్మకమైన దేవాలయాలని గుర్తుచేశారు. ఈ ప్రాంతాలను టూరిజంగా తీర్చిదిద్దడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగానే సోమశిల నుండి శ్రీశైలం వరకు లాంచీని ప్రారంభించామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాలలో చారిత్రత్మకమైన చరిత్ర ఉందని, అవి పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉన్నాయని అన్నారు. స్వదేశీ దర్శన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఆ పథకంలో రూ. 100 కోట్ల నిధులను తెలంగాణ పర్యాటక అభివృద్ధి కోసం కోరామని, ఆ నిధులను రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రానున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని సోమశీలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కొల్లాపూర్ సంస్థానాల నుంచి ఎన్నో దేవాలయాలు నదీ తీరాన ఉన్నాయని, నదీ తీరాన గల కొండలు పాపికొండలను తలపించే విధంగా ఉంటాయని, కృష్ణానదిలో పర్యటిస్తుంటే అద్భుతమైన దృశ్యాలు కళ్లకు కనబడుతున్నాయన్నారు. పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు మాట్లాడుతూ తెలంగాణలో మరుగునపడిన పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తెచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్ టూరిజంపైన ప్రత్యేక దృష్టి పెట్టారని కొనియాడారు. ప్రపంచంలోనే వివిధ దేశాల పర్యాటకులు చూసే అద్భుతమైన దృశ్యాలు తెలంగాణలో ఉన్నాయని, వాటన్నింటినీ ప్రపంచ పర్యాటకుల ముందు ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సోమశిల దగ్గర కృష్ణానదిలో లాంచీని
ప్రారంభిస్తున్న పర్యాటక మంత్రి చందులాల్