బిజినెస్

మొండి బకాయల వసూలుకు బ్యాంకు మేనేజర్ దీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, మే 5: సమభావన మహిళా పొదుపు సంఘాలు బ్యాంకు రుణాలు తీసుకుని ఎగవేత ధోరణితో చెల్లింపునకు నిరాకరిస్తుండటంతో వాటి రికవరి కోసం నల్లగొండ మండలం అప్పాజిపేట కెనరా బ్యాంకు మేనేజర్ రావు గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గ్రామ పంచాయతీ వద్దగల శ్రీ సీతారామాంజనేయ స్వామి గుడి ముందు మేనేజర్‌తోపాటు ముగ్గురు సిబ్బంది రిలే దీక్ష చేపట్టారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నిరాహార దీక్ష ప్రారంభించారు. బ్యాంకు విధులకు ఆటంకం కలగకుండా ఉదయం 7-30 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు మేనేజర్ రావు తెలిపారు. అయతే మొండి బకాయల వసూళ్ల కోసం మునుపెన్న డూ‚లేనివిధంగా ఓ బ్యాంకు మేనేజర్ ఇలా నిరాహారదీక్ష చేపట్టడం చర్చనీయాంశమైంది. బకాయిల చెల్లింపునకు మహిళా సంఘాలు ముందుకు వచ్చేదాకా తమ రిలే దీక్ష కొనసాగుతుందని, పాదయాత్ర, రోడ్ షో సైతం నిర్వహిస్తామని మేనేజర్ రావు హెచ్చరించారు. మొత్తానికి ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయలు ప్రమాదకర స్థాయకి చేరిన నేపథ్యంలో వాటిపట్ల రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో వినూత్నరీతిలో ఏకంగా ఓ ప్రభుత్వరంగ బ్యాంక్ మేనేజరే ఈ విధంగా రిలే నిరాహార దీక్షలు చేపట్ట డం ఇప్పుడు చుట్టుపక్కలే కాకుండా బ్యాంకింగ్ రంగంలోనూ మిక్కిలి ప్రాధాన్యతను సంతరిం చుకుంది.

chitram అప్పాజిపేటలో మొండి రుణాల వసూళ్ల కోసం రిలే నిరాహార దీక్ష చేపట్టిన
బ్యాంకు మేనేజర్ రావు (ఇన్‌సెట్‌లో), సిబ్బంది