బిజినెస్

అల్ట్రాటెక్‌లో పెరిగినా.. ఐడియాలో తగ్గిన బిర్లా వేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: సిమెంట్ తయారీ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ చైర్మన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార మంగళం బిర్లా గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 22.50 కోట్ల రూపాయల వేతనాన్ని పొందారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16)తో పోల్చితే 18.2 శాతం పెరిగింది. కాగా, ఈసారి తన గ్రూప్ టెలికామ్ సంస్థ ఐడియా సెల్యులార్ నుంచి కేవలం 3.3 లక్షల రూపాయల పారితోషికానే్న అందుకున్నారు. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జి టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఉచిత సేవల ధాటికి ఐడియాతోపాటు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి దిగ్గజ సంస్థల ఆదాయం భారీగా పడిపోయినది తెలిసిందే.