బిజినెస్

బైక్ ధరలను తగ్గించిన పొలారిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: అమెరికాకు చెందిన లగ్జరీ మోటార్ సైకిళ్ల తయారీదారు పొలారిస్ భారతీయ బ్రాండైన ఇండియన్ మోటార్‌సైకిల్ సంస్థ.. వివిధ రకాల మోడళ్ల ధరలను 2.21 లక్షల రూపాయల మేర తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు నేపథ్యంలో ఇండియన్ స్కౌట్, ఇండియన్ డార్క్ హార్స్, ఇండియన్ చీఫ్ క్లాసిక్ శ్రేణుల్లోని బైక్‌ల ధరలను 9 శాతం నుంచి 12 శాతం మేర తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. దీంతో స్కౌట్ మోడల్ ధర 14.75 లక్షల రూపాయల నుంచి 12.99 లక్షల రూపాయలకు, డార్క్ హార్స్ ధర 23.4 లక్షల రూపాయల నుంచి 21.25 లక్షల రూపాయలకు, చీఫ్ క్లాసిక్ ధర 24.2 లక్షల రూపాయల నుంచి 21.99 లక్షల రూపాయలకు దిగివచ్చాయి. ఇప్పటికే పలు దేశీయ ఆటో రంగ సంస్థలు జిఎస్‌టి కారణంగా ధరలను తగ్గించినది తెలిసిందే.