బిజినెస్

తగ్గిన కాల్గేట్ టూత్‌పేస్ట్, బ్రష్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 7: కాల్గేట్ పామోలివ్ (ఇండియా).. తమ టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్‌ల ధరలను 8-9 శాతం మేర తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) విధానంలో పన్నుల భారం తగ్గడమే దీనికి కారణం. జిఎస్‌టిలో టూత్‌పేస్ట్‌లపై పన్ను దాదాపు 24 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. దేశీయ టూత్‌పేస్ట్ మార్కెట్‌లో కాల్గేట్ పామోలివ్ వాటా సుమారు 56 శాతం. ఈ క్రమంలోనే 100 గ్రాముల పేస్ట్‌పై 6 రూపాయలు, 65 రూపాయల గరిష్ఠ ధర కలిగిన బ్రష్‌పై 5 రూపాయల ధరను తగ్గించింది. ఇప్పటికే పలు ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించగా, హిందుస్థాన్ యునిలివర్ సబ్బులు, సర్ఫ్‌ల ధరలను తగ్గించింది.