బిజినెస్

హైదరాబాద్‌లో మరో కార్యాలయాన్ని ప్రారంభించిన సింక్రోనీ ఫైనాన్షియల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: ప్రీమియర్ కన్స్యూమర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ సింక్రోనీ ఫైనాన్షియల్.. హైదరాబాద్‌లో తమ రెండవ కార్యాలయాన్ని హైటెక్‌సిటీలోని నాలెడ్జ్‌సిటీ వద్దనున్న సలార్‌పురియా సత్వాలో శుక్రవారం ప్రారంభించింది. 2 లక్షల చదరపు అడుగులలో మూడు అంతస్తులలో విస్తరించిన ఈ కార్యాలయం.. వైవిధ్యమైన ఆర్కిటెక్చర్, ప్రోగ్రెసివ్ డిజైన్ కలిగింది. గత కొనే్నళ్లుగా భారతీయ సెంటర్ల అభివృద్ధి కోసం సింక్రోనీ ఫైనాన్షియల్ భారీ ఎత్తున పెట్టుబడులను పెడుతోంది. కాగా, 1932లో సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవగా, ప్రస్తుతం ప్రైవేట్ లేబుల్ క్రెడిట్ కార్డులను అమెరికాలో అందిస్తున్న అతిపెద్ద సంస్థగా ఇది వెలుగొందుతోంది. తమ ఉత్పత్తులను అంతర్జాతీయ, జాతీయ రిటైలర్లు, స్థానిక మర్చెంట్లు, తయారీదారులు, పరిశ్రమ సంఘాలు, హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్లు విస్తృత శ్రేణిలో వాడుతున్నారని సింక్రోనీ ఫైనాన్షియల్ సంస్థ ఈ సందర్భంగా తెలిపింది.

చిత్రం.. సింక్రోనీ ఫైనాన్షియల్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ దృశ్యం

.