బిజినెస్

ప్రభుత్వ పరిశీలనలో స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 7: చిత్తూరు జిల్లాలోని పుత్తూరు, నగరి మధ్యలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం (స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ) ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి చెప్పారు. శుక్రవారం తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో జాతీయ యంత్ర పరికరాల ప్రదర్శన ‘మెగా పరిశ్రమల మిషనరీ ఎక్స్‌పో 2017’ను మంత్రి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోస్టల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలోకి వచ్చిందన్నారు. ఈ జోన్ పరిధిలో అనేక పరిశ్రమలు వస్తున్నాయని, దీని ద్వారా 10 వేల మందికి ఉపాధి, మరో 40 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. దీనివల్ల బెంగళూరు-చెన్నై కారిడార్, విశాఖపట్నం-చెన్నై కారిడార్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడుతుందన్నారు. కాగా, రాష్ట్రంలోని 101 నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) పార్కులు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు యువత, మహిళలు తమ కాళ్లపై నిలబడేలా పరిశ్రమలు స్థాపించి, వారు ఆర్థికంగా ఎదిగి ఉపాధి అవకాశాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. స్వయం ఉపాధికి మంచి అవకాశాలు ఉన్నాయని, రాయలసీమ జిల్లాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహం కావాలన్నారు. ఇప్పటికే శ్రీసిటీలో 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 45 వేల మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. మరో రెండు నెలల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్యవేడు వద్ద హీరో మోటార్ కంపెనీకి భూమి పూజ, అపోలో టైర్స్ పరిశ్రమల శంకుస్థాపన జరుగుతుందని మంత్రి అమరనాథ్ వివరించారు. 2015-20 పారిశ్రామిక పాలసీ ద్వారా పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకువస్తే 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.