బిజినెస్

తగ్గిన ఇమామీ హెయిర్ ఆయిల్ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: కోల్‌కతాకు చెందిన ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థ ఇమామీ.. హెయిర్ ఆయిల్ ధరలను తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు నేపథ్యంలో కలిగిన ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో 50, 100, 200 మిల్లీలీటర్ల బాటిళ్లపై 2 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గింపునిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమల్లోకి రాగా, హెయిర్ ఆయిల్, సబ్బులు, టూత్‌పేస్టులు, సర్ఫ్ తదితర ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టాయి. వీటిపై పన్ను భారం తగ్గడమే ఇందుకు కారణం.