బిజినెస్

తెలంగాణ అభివృద్ధికి చేయూతనివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) విధానాల్లో భాగంగా చేయూతనివ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్ర అభివృద్ధికి దోహదప డాలని మంత్రి కోరారు. గురువారం నాడిక్కడ కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) తెలంగాణ యూనిట్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టిపిసిఎల్) భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సిఎస్‌ఆర్ సమ్మిట్‌ను మంత్రి ప్రారంభించారు. సంప్రదాయ సిఎస్‌ఆర్ కార్యకలాపాలను వివిధ అధునాతన పద్ధతుల్లో అందించేందుకు ఉద్దేశించి నిర్వహించిన ఈ సమ్మిట్‌లో మంత్రి ప్రసంగిస్తూ కార్పొరేట్ సంస్థలు భారీగా సిఎస్‌ఆర్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా సిఎస్‌ఆర్ కార్యకలాపాలను క్రోడీకరించి సమాజాభివృద్ధికి దోహదపడాలని సూచిం చారు. ఎన్‌టిపిసి తమ సిఎస్‌ఆర్ కార్యకలాపాల్లో భాగంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసి నేరాలను అరికట్టేందుకు సిసి టివి కెమెరాలను ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మొదటి విడతగా రూ. 25 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో మంత్రి ఈటల చేతుల మీదుగా నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి స్వీకరించారు. నగరంలో భద్రతను పటిష్టం చేసే క్రమంలో సిసిటివి ప్రాజెక్టు అతి ముఖ్యమైనదని గుర్తు చేస్తూ ఎన్‌టిపిసి అందించిన సహకారానికి మంత్రి అభినందనలు తెలిపారు. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఇలాంటి సహకారం దోహదపడుతుందని అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమ వర్గాలు తమ శాఖ చేపట్టిన సిసిటివి ప్రాజెక్టుకు సిఎస్‌ఆర్ నిధులు అందించి నగరాభివృద్ధికి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఎన్‌టిపిసి మానవ వనరుల విభాగం డైరక్టర్ యుపి ఫణి మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ నగర పరిధిలో సిసిటివి ప్రాజెక్టుకు సహకరించడం తమకు సంతోషంగా ఉంద న్నారు. తమ సామాజిక బాధ్యతను మరింత విస్తరింప చేస్తామని చెప్పారు. తొలుత సిఐఐ తెలంగాణ విభాగం చైర్మన్ నృపేందర్ రావు ఈ సమ్మిట్‌కు స్వాగతోపన్యాసం చేశారు. వ్యాపారంలో భాగంగానే సిఎస్‌ఆర్ కార్యకలాపాలను తీర్చిదిద్దే అజెండాను అమలు చేసేందుకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించామని నృపేందర్‌రావు చెప్పారు. లాభాల బాటలో పయనించేందుకు ఇవి కీలకపాత్ర వహిస్తాయని వివరించారు.

chitram
సిసి కెమెరాల ఏర్పాటుకు ఎన్‌టిపిసి ఇచ్చిన రూ. 25 లక్షల విరాళాన్ని సిపి మహేందర్ రెడ్డికి అందిస్తున్న ఈటల రాజేందర్