బిజినెస్

మదనపల్లె మార్కెట్‌లో కిలో టమోటా రూ. 75!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూలై 8: చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో టమోటా సాగు కరవు జయిస్తోంది. దీనికి గత 15 రోజులుగా టమోటా ధరలే నిదర్శనం. శనివారం మదనపల్లె మార్కెట్‌లో 30 కిలోల టమోటా ధర 2,350 రూపాయల నుంచి 2,500 రూపాయల మేర పలికింది. ఉన్న అరకొర జలవనరులతో ఆరుగాలం కష్టించి పండించిన టమోటా పంటకు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంతోషపడుతున్నారు. ఢిల్లీ, గోవా, ఆగ్రా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, ఒడిషా, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలలో టమోటా పంటలు లేకపోవడం.. అక్కడ డిమాండ్ ఉండటంతో ఆ ప్రాంతానికి మదనపల్లె టమోటాలు ఎగుమతి అవుతున్నాయి. దీంతో రైతు చేతినిండా సొమ్ము అందుతోంది. మరోవైపు గత రెండు రోజులుగా తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకూ మదనపల్లె టమోటా ఎగుమతి అవుతోంది. గత 15 రోజులుగా మదనపల్లె మార్కెట్‌కు 350 నుంచి 450 మెట్రిక్ టన్నుల టమోటాలు దిగుమతి అవుతున్నాయి. వ్యాపారుల మధ్య పోటీ పెరగడంతో ధరలు అనుకూలంగా లభిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో ధరలు లేకపోవడం, తక్కువ ధరల కారణంగా పంటల సాగు చేయకపోవడం, మేలో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతినడం వెరసి తక్కువ శాతం దిగుబడి అవుతుండటంతో ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుదల నేపథ్యంలో జిల్లాలోని మదనపల్లె, తంబళ్ళపల్లి, పుంగనూరు, పీలేరు, పలమనేరు నియోజకవర్గాల ప్రాంతాలలో టమోటా పంటను రైతులు అధికంగా సాగు చేశారు. ధరలు ఈ రోజుకు ఇలాఉన్నా.. రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని వ్యాపార వర్గాలు అంటుండటం గమనార్హం.

చిత్రం.. శనివారం మదనపల్లె మార్కెట్‌కు వచ్చిన టమోటాలు