బిజినెస్

కలిసికట్టుగా ఆర్థిక వృద్ధిని సాధిద్దాం: జి20 దేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంబర్గ్, జూలై 8: జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన జి20 దేశాల సదస్సులో సభ్యదేశాల అధినేతలు అక్రమ వాణిజ్య కార్యకలాపాలకు వ్యతిరేకంగా సంయుక్తంగా పోరాడాలని, ప్రపంచ ఆర్థిక వృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని శనివారం ప్రతిజ్ఞ చేశారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా చివరిరోజైన శనివారం.. భారత్‌సహా ఇతర జి20 సభ్యదేశాలు పరస్పర లబ్దిపూర్వక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయాలని నిశ్చయించుకున్నాయి. పారదర్శక విధానాలతో ఒకరి అభివృద్ధిని మరొకరు కోరుకుంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో జి20 దేశాలు సత్తా చాటాలని అభిలషించాయి.