బిజినెస్

జమ్ముకాశ్మీర్‌లోనూ జిఎస్‌టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను శనివారం నుంచి జమ్ముకాశ్మీర్ కూడా అమల్లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఈ చారిత్రక పన్ను ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చినది తెలిసిందే. అయితే జమ్ముకాశ్మీర్‌లోనే అమలుకాలేదు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా చొరవ తీసుకోగా, శుక్రవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో జిఎస్‌టి బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో శనివారం నుంచి అక్కడ కూడా జిఎస్‌టి అమల్లోకి వచ్చింది. మరోవైపు జిఎస్‌టికి ముందు అమ్ముడవ్వని ఉత్పత్తులపై కొత్త ధరలను ముద్రించాలని ఆయా సంస్థలకు కేంద్రం గట్టిగా చెబుతోంది. లేనిపక్షంలో చర్యలు తప్పవంది.