బిజినెస్

వెలవెలబోతున్న వెండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: వెండి ధరలు వెలవెలబోతున్నాయి. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో మార్కెట్‌లో వెండి వెలుగులు కనిపించడం లేదు. ఈ వారం బులియన్ మార్కెట్ ట్రేడింగ్‌ను పరిశీలిస్తే కిలో వెండి ధర 37,400 రూపాయల వద్ద ముగిసింది. శనివారం ఒక్కరోజే 800 రూపాయలు పతనమైంది. మంగళవారమైతే ఏకంగా 1,335 రూపాయలు క్షీణించింది. అయితే తర్వాతి రోజు మళ్లీ కోలుకున్నప్పటికీ, ఈ వారం మొత్తంగా 1,900 రూపాయలు దిగజారింది. ఈ ఏడాది ప్రారంభంలో 39,400 రూపాయల వద్ద వెండి ధర మొదలవగా, ప్రస్తుత ముగింపుతో పోల్చితే 2,000 రూపాయలు తగ్గినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు బంగారం ధరల్లోనూ ఈ వారం స్వల్ప క్షీణత నమోదైంది. శనివారం 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన పసిడి ధర 28,900 రూపాయల వద్ద స్థిరపడగా, ఈ ఒక్కరోజే 250 రూపాయలు తగ్గింది. ఇక ఈ వారం మొత్తంగా చూస్తే 300 రూపాయలు పడిపోయింది. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి గమనిస్తే 600 రూపాయలు పెరిగింది. నాడు 28,300 రూపాయల వద్ద మొదలైంది. కాగా, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, జాతీయంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వంటివి అటు వెండి, ఇటు పుత్తడి ధరలను దెబ్బతీస్తున్నాయి. విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను బంగారంపై గాకుండా డాలర్లపై పెడుతున్నారు. దీంతో డిమాండ్ సన్నగిల్లింది. న్యూయార్క్‌లో ఔన్సు బంగారం ధర 1.04 శాతం దిగి 1,212.20 డాలర్లుగా ఉంది. అలాగే ఔన్సు వెండి ధర 2.84 శాతం తగ్గి 15.57 డాలర్లు పలికింది. ఇక జిఎస్‌టికి ముందు బంగారంపై తక్కువగా ఉన్న పన్నుకాస్తా.. జిఎస్‌టి తర్వాత పెరగడం కూడా బులియన్ మార్కెట్‌ను ప్రభావితం చేసింది. బంగారంపై ప్రత్యేకంగా 3 శాతం పన్నును జిఎస్‌టిలో విధించినది తెలిసిందే. దీంతో కొనుగోలుదారులు మునుపటిలాగా కొనుగోళ్లను జరపలేకపోతున్నారని బులియన్ ట్రేడర్లు చెబుతున్నారు. అదీగాక పెళ్ళిళ్ల సీజన్ కాకపోవడం కూడా డిమాండ్‌ను తగ్గించిందని అంటున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడుతుండటం కూడా బులియన్ మార్కెట్ పతనానికి ఓ కారణమేనని, మదుపరులు స్టాక్స్ కొనుగోళ్లకే అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారని విశే్లషకులు పేర్కొంటున్నారు. దీంతో సహజంగానే బంగారంపై పెట్టుబడులు తగ్గుతున్నాయని, ఉన్న పెట్టుబడులూ ఉపసంహరణకు గురికావడంతో ధరలు పడిపోతున్నాయని అంటున్నారు. సాధారణంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు బంగారంపై పెట్టుబడులను మదుపరులు ప్రత్యామ్నాయంగా భావిస్తారు. స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లినప్పుడు బంగారానికి ఏర్పడే డిమాండ్‌తో దానిపై గతంలో పెట్టిన పెట్టుబడుల విలువ ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో స్టాక్ నష్టాల నుంచి తప్పించుకుంటారు. అయితే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలు, కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీసుకుంటున్న సంస్కరణల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డుస్థాయి లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. దీంతో బంగారంపై మదుపరుల పెట్టుబడులూ తగ్గిపోతున్నాయి. ధరలూ పడిపోతున్నాయి. ఫలితంగా బులియన్ మార్కెట్ కళ తప్పుతోంది.