బిజినెస్

డబ్ల్యుహెచ్‌ఐకి గ్లోబల్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అమెరికా సంస్థ వాటర్‌హెల్త్ ఇంటర్నేషనల్ (డబ్ల్యుహెచ్‌ఐ).. ఓ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ అవార్డును గెలుచుకుంది. భారత్‌సహా ఘనా, నైజీరియా దేశాల్లో ప్రజలకు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన మంచినీటి (త్రాగునీరు)ని చౌక ధరలకే అందించడంలో చేసిన కృషికిగాను యునిలివర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ అవార్డు దక్కింది. ఈ నెల 4న లండన్‌లో జరిగిన 20వ రెస్పాన్సిబుల్ బిజినెస్ అవార్డుల వేడుకలో ఈ అవార్డును ప్రదానం చేసినట్లు ఓ ప్రకటనలో డబ్ల్యుహెచ్‌ఐ శనివారం తెలిపింది. బార్క్‌లేస్, జిఎస్‌కె, అగ్రో అమెరికా, ఎమ్-ట్రోన్ ఆఫ్రికా, సన్నీ మనీ, ఐజ్ తదితర 48 మంది ఫైనలిస్టులతో పోటీపడి ఈ అవార్డును సొంతం చేసుకుంది.