బిజినెస్

రాష్ట్రాలే వద్దన్నాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 8: ‘వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో అధికారం పెరగలేదు.. తగ్గలేదు.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పన్నులను పరిశీలించి జాతీయ సగటు ధరలతో పోల్చుకున్న తర్వాతే జిఎస్‌టిలో శ్లాబులు నిర్ణయించాం.’ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శనివారం ఇక్కడ ఒక హోటల్‌లో జిఎస్‌టిపై జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా నిర్మలా సీతారామన్ విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20 లక్షల రూపాయల లోపు వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులు జిఎస్‌టి పరిధిలోకి రారని, 75 లక్షల రూపాయలలోపు టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఎటు వెళతారనేది వారే నిర్ణయించుకోవాలని సూచించారు. కాగా, జిఎస్‌టి వలన ప్రజలపై భారం పడుతుందనడంలో వాస్తవం లేదని, ఎప్పుడైనా పన్నులు చెల్లించేది వినియోగదారుడేనని ఆమె అన్నారు. అంతకు ముందు జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకే పెట్రోల్, డీజిల్, మద్యంను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురాలేదన్నారు. జిఎస్‌టిని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతోందనే ప్రచారంలో వాస్తవం లేదన్న మంత్రి.. జిఎస్‌టి కౌన్సిల్‌లో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారని గుర్తుచేశారు.
ఈ పరిస్థితుల్లో కేంద్రం జిఎస్‌టిని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడం అసాధ్యమని పేర్కొన్నారు. జిఎస్‌టి కౌన్సిల్‌లో అందరికీ సమాన హక్కులు ఉంటాయని వివ రించారు. జిఎస్‌టి రేట్ల నిర్ణయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించలేదని, రాష్ట్రాలకూ విలువిచ్చిందన్నారు. జిఎస్‌టి విధివిధానాలపై పలుమార్లు కౌన్సిల్ సమావేశమై చర్చించాకే జూలై 1వ తేదీ నుండి అమలులోకి తెచ్చామన్నారు. జూన్ 30వ తేదీ ముందు కేంద్ర మంత్రులు రాష్ట్రాల్లో పర్యటించి జిఎస్‌టిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, తిరిగి అమలులోకి వచ్చిన తర్వాత ప్రజలతో కలిసి అభిప్రాయాలు సేకరించేందుకు వారం రోజుల పాటు కేంద్ర మంత్రు లు ప్రధాన పట్టణాల్లో పర్యటిస్తున్నట్టు ఆమె తెలిపారు.
వస్తువు తయారైనప్పటి నుండి వినియోగదారుని వద్దకు చేరే వరకు వేస్తున్న పలు రకాల పన్నుల స్థానంలో ఒకే పన్ను విధానం ఇందులో ఉందన్నారు. కాగా, జిఎస్‌టి అమలు తరువాత ఎగుమతులపై మరింత సానుకూలమైన ప్రభావం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు సినీ పరిశ్రమ ఆందోళనలపై స్పందిస్తూ వారికి జిఎస్‌టితో సమస్య లేదని, స్థానిక పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న 30 శాతం అదనపు భారంపైనేన న్నారు. విలేఖరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్, పార్లమెంటు సభ్యుడు గోకరాజు గంగరాజు, మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, ఆరోగ్య వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆర్ లక్ష్మీపతి, జిఎస్‌టి కమిషనర్ శ్రీహరిరావు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న నిర్మలా సీతారామన్