బిజినెస్

దక్షిణాదికి విస్తరించిన ఆయే ఫైనాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: దేశీయ ఆర్థిక సేవల రంగంలో శరవేగంగా విస్తరిస్తున్న ఆయే ఫైనాన్స్ కంపెనీ.. దక్షిణాది మార్కెట్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడుల్లో ఒక్కసారే 8 శాఖలను ప్రారంభించింది. సూక్ష్మ, చిన్నతరహా వ్యాపార అవసరాలకు రుణాలందించే ఈ కంపెనీకి 20,000 కస్టమర్లుండగా, వ్యాపారం విలువ 200 కోట్ల రూపాయలుగా ఉంది. గుర్గావ్ కేంద్రంగా ఏర్పాటైన కంపెనీ.. 10 రాష్ట్రాల్లో 60 శాఖల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, కర్నాటకలోని గుల్బర్గా, రాయచూర్, తమిళనాడులోని సేలం, ఈరోడ్‌లో కొత్త బ్రాంచ్‌లను తెరిచింది. గత నెల 29న వీటిని ఏర్పాటు చేసినట్లు సంస్థ ఎండి సంజయ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. వీటి ద్వారా చిన్న, సూక్ష్మ రుణాలను అందించడం వల్ల ఆ వర్గం ప్రజలకు తాము మరింత చేరువ అవుతామన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. తమ వార్షిక లక్ష్యాలను చేరుకోవడానికి దేశవ్యాప్తంగా అదనంగా మరో 40 శాఖలను నెలకొల్పబోతున్నామన్నారు.